అక్టోబర్ 2 నుంచి కొలువు.. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ ఫలితాలు రిలీజ్

0
953

పల్లెలే పట్టుగొమ్మలు. గ్రామ సీమలు అభివృద్ధిపై నేతలు ఫోకస్ చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధికి గ్రామ సచివాలయాలు ఊతమిస్తాయని వైసీపీ సర్కార్ భావించింది. ఈ మేరకు లక్ష 26 కొలువులకు పరీక్ష నిర్వహించింది. అయితే భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలలో పరీక్ష రాయగా .. కాసేపటి క్రితం ఏపీ సీఎం జగన్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు

వారం రోజులు పరీక్ష ..

లక్షా 26 వేల కొలువులకు సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఎగ్జామ్ పెట్టారు. 14 విభాగాల్లో 19 రకాల పోస్టులు ఉండటంతో ఆ మేరకు అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 21 లక్షల మంది అభ్యర్థులు ఆప్లై చేశారు. కానీ 19.74 లక్షల మంది పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణను పారదర్శకంగా చేపట్టారు. పరీక్ష ఫలితాలను http://gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు కోరారు.

అర్హత సాధించింది వీరే .. బీసీ కేటగిరిలో లక్షా 494 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్సీ కేటగిరిలో 63 వేల 629 మంది అభ్యర్థులు, ఎస్టీ కేటగిరిలో 9548 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు సాధించారు. అదే బీసీ కేటగిరిలో కూడా అత్యధికంగా 122.5 మార్కులు పొందారు. ఎస్సీ కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు, ఎస్టీ కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు, మహిళా అభ్యర్థులకు గరిష్టంగా 112.5 మార్కులు, పురుష అభ్యర్థుల్లో గరిష్టంగా 122.5 మార్కులు సాధించారు. Sponsored Dubai Investment Properties Might Actually Surprise You Investment Properties |… Sponsored The Modern Way To Do Rustic Design Mansion Global

2 నుంచి కొలువులోకి ..

ఇన్ సర్వీస్ అభ్యర్థులకు 10 శాతం మార్కులను అధికారులు కలిపారు. ఎంపికైన వారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పదవీ చేపడుతారు. ఆయా కొలువులకు ఎంపికైన వారికి ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదిన శిక్షణ ఇస్తారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ సచివాలయాలను ప్రారంభిస్తారు. అదేరోజు ఉద్యోగులు విధుల్లో చేరతారని ఏపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here