అలా చేస్తే.. నేను మరణించినట్టే.. విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్

0
1280

సూపర్ పవర్‌స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి కొద్దిరోజులుగా మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల ముంబైకి తరచుగా వెళ్తుండటంతో రూమర్లకు బలం చేకూరంది. అంతేకాకుండా సెప్టెంబర్ 6వ తేదీన విజయ్ దేవరకొండ బాలీవుడ్ చిత్రం మొదలు కాబోతున్నదనే వార్త మీడియలో వైరల్ అయింది. అంతేకాకుండా రష్మిక మందన్నతో కలిసి ముంబైకి వెళ్లడం ఇంకా ఆ రూమర్లు భగ్గమన్నాయి. తాజాగా మనీష్ మల్హోత్రా ఇంటిలో జరిగిన పార్టీలో కియారా అద్వానీ, కరణ్ జోహర్‌తో కలిసి మీడియాకు ఫొజిచ్చారు. ఇలాంటి రకరకాల వార్తల మధ్య విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీపై పెదవి విప్పారు.

బాలీవుడ్ ఎంట్రీ గురించి బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నాను. అది ఎప్పుడు మొదలవుతుందో నేను చెప్పలేను కానీ.. ఆ దిశగా ప్లాన్ చేస్తున్నాం. ఆ సినిమా కోసమే నేను ఆలోచించడం లేదు. ఒకవేళ బాలీవుడ్ సహరిస్తే.. ప్యాన్ ఇండియా హీరోను కావడానికి, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి ఎదురుచూస్తున్నాను అని విజయ్ దేవరకొండ అన్నారు.

టాలీవుడ్‌తో సంతృప్తి తెలుగు సినిమా రంగంలో నేను చేస్తున్న సినిమాల పట్ల నాకు సంతృప్తి ఉంది. బాలీవుడ్ సినిమాతోనే నా కెరీర్ ఉండాలని అనుకోవడం లేదు. నా కెరీర్‌కు హిందీ సినిమాలు ఎక్స్‌టెన్షన్ మాత్రమే. తెలుగు సినిమాలు చేస్తూనే బాలీవుడ్ అవకాశాలను పరిగణనలోకి తీసుకొంటాను. అంతేకానీ టాలీవుడ్‌ను వదిలేసే ప్రసక్తి లేదు అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

రీమేక్ సినిమాలో నటించడంపై డియర్ కామ్రేడ్ సినిమా హిందీలో రీమేక్ అవుతున్నట్టు వచ్చిన వార్తలపై విజయ్ దేవరకొండ స్పందించాడు. నేను తీసిన సినిమా రీమేక్ చేస్తే అందులో నటించడం నాకు ఇష్టం ఉండదు. నా సినిమాను మళ్లీ వేరే భాషలో తీస్తే ఎప్పటికీ నటించను. ఒకవేళ నటిస్తే నటుడిగా నేను మరణించినట్టే అని విజయ్ దేవరకొండ సెన్సేషన్ కామెంట్స్ చేశాడు.

నిరాశ పరిచిన డియర్ కామ్రేడ్ ఇక విజయదేవరకొండ కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో విడుదలైన డియర్ కామ్రేడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో విడుదలైన ఈ చిత్రం ఎక్కువగా ప్రజాదరణను పొందలేకపోయింది. ప్రస్తుతం క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్, అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here