ఆస్పత్రుల్లో సంస్కరణలు… డాక్టర్లకు హైబీపీ తెప్పిస్తున్న జగన్?

0
1511

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించాలని, వారి బేసిక్‌ శాలరీని పెంచాలని నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య రంగంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించిన నిపుణుల కమిటీ కీలక సూచనలు చేసింది. సుమారు 100 సూచనలు చేసింది. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడంపై నిషేధం విధించాలని ప్రధానంగా సూచించింది. అదే సమయంలో వారికి వేతనాలు కూడా భారీగా పెంచాలని ప్రతిపాదించింది. దీనికి వెంటనే అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వేతనాల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అదికారులను ఆదేశించారు. కమిటీ ఇచ్చి సిఫారసులపై సీఎం జగన్ విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. ఆ సేవలు నవంబర్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం కానుంది.

ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు : జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టును పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేయనున్నారు. 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకురానున్నారు. మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తున్నారు. ఏప్రిల్‌ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం కూడా ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.

ప్రభుత్వానికి నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్ని :

మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి

  • ప్రతి 5వేలమందికి ఒక సబ్‌ సెంటర్‌ ఉండాలి
  • ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి
  • ప్రతివేయి మందికి జనాభాకు విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేయాలి
  • చిన్న చిన్న వాటికి అక్కడికక్కడే చికిత్స అందించాలి
  • రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారు. వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి
  • యూత్‌ క్లబ్బుల తరహాలో క్లబ్బులను ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి
  • సబ్‌సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాల్సి ఉంది
  • ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలి
  • ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యులు ఉండాలి
  • ఒక కౌన్సెలర్‌ లేదా సోషల్‌ వర్కర్‌ ఉండాలి
  • దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలి
  • ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు నడిచేలా చూసుకోవాలి
  • 2 బెడ్‌ ఐసీయూ సదుపాయం ఉండాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here