ఆ తెలుగు నటుడు నాకు రక్తంతో రాసి లవ్ లెటర్స్ పంపాడు.. పూరీకి నేనంటే ఇష్టం: సంఘవి కామెంట్స్

0
1144

‘ఆహా’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు సీనియర్ హీరోయిన్ సంఘవి. మొదట్లో చిన్న హీరోలతో సినిమాలు చేసినా అత్యత్తమ నటన కనబరిచి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె.. బడా హీరోలతో సైతం స్క్రీన్ షేర్ చేసుకుంది. దీంతో ఆమె చాలా ఫేమస్ అయిపోయారు. ఇలా తెలుగులోనే కాకుండా దక్షిణాదిలోని భాషలన్నీంటిలో ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక, తాజాగా ఆమె ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

సంఘవి నేపథ్యం ఇది సంఘవి అసలు పేరు కావ్య రమేష్. ఈమె కర్నాటకలోని మైసూర్‌లో జన్మించింది. ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి, ముక్కు, గొంతు విభాగానికి అధిపతి. ఈమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో సాగింది. సంఘవి యుక్త వయసునుండే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. చిన్నపట్టి నుండే సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది.

సినీ నేపథ్యం ఇది ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి, సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు. ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది. అప్పుడే సినిమాలలో నటించాలన్న అభిరుచికి బీజం పడింది. ఈమె అజిత్ సరసన నటించిన తమిళ సినిమా ‘అమరావతి’తో పేరు దక్కించుకుంది. ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. సంఘవికి ‘సింధూరం’ సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డు అందుకున్నది.

టాలీవుడ్ డైరెక్టర్‌తో పెళ్లి సంఘవి తెలుగు సినిమా దర్శకుడు సురేష్ వర్మను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ‘శివయ్య’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయమంలో వీళ్ల మధ్య ప్రేమ పుట్టింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. వివాహం తర్వాత సంఘవి సినిమాలకు దూరమయ్యారు. కొన్నేళ్ల తర్వాత మరోసారి ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత బుల్లితెర పైనా తళుక్కుమంది. ప్రస్తుతం తెలుగు ఛానెళ్లలోనూ కనిపిస్తోంది.

షాకింగ్ కామెంట్స్ అలీతో సరదాగా కార్యక్రమంలో సంఘవి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘మీ తమ్ముడు ఖయ్యూ నాకు జూనియర్. అతడు నాకు లవ్ లెటర్స్ ఎన్నో పంపించేవాడు. కొన్ని రక్తంతో కూడా రాశాడు. రోజుకో లెటర్ పంపేవాడు’ అని ఆమె వెల్లడించింది. దీంతో అలీ కూడా షాక్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here