కోడెల మరణం: చంద్రబాబును ఇరుకున పెడుతున్న ప్రశ్నలివే..?

0
1361

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య… ఆ తదనంతర పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అంటూ ప్రతిపక్ష టీడీపీ ఈ హత్య నుంచి రాజకీయంగా లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్టు విమర్శలు చెబుతున్నారు. కోడెల తీవ్రమైన మనస్తాపంతో మరణించిన మాట వాస్తవమే.

వాస్తవంగానే ఎంత క్షోభకు గురిగాకపోతే ఓ ప్రాంత పులిగా ప్రసిద్ధుడైన అత్యంత సీనియర్ పోరాటశీలి అలా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణిస్తాడు..? అయితే ఆ క్షోభ జగన్ పెట్టిన కేసుల దుర్మార్గమా..? తన జీవితమంతా తెలుగుదేశానికే అంకితం చేస్తే, తనకు కష్టకాలంలో పార్టీ అండగా ఉండలేదనే చిత్తక్షోభా..? ఏది నిజమైన కారణం..? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇన్నాళ్లూ కోడెల శివప్రసాదరావు పై కేసుల విషయంలో మౌనంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు కోడెల మరణంతో చాలా విషయాలు చెబుతున్నారు. 2 నెలల్లో 19 కేసులు పెట్టారు….. లక్ష కోట్లు తిన్నోడు ఆఫ్టరాల్ లక్ష, 2 లక్షల ఫర్నీచర్ కేసు పెడతాడా..?.. సోమిరెడ్డి, నన్నపనేని, చింతమనేని, యరపతినేని ఇలా అందరి మీదా కేసులు పెడుతున్నారు… 11 మంది సీఎంలను చూశాను.. ఈ ఉన్మాదాన్ని నా లైఫులో ఎప్పుడూ చూడలేదు.. రాజకీయ కక్షసాధింపులకే కోడెల బలయ్యాడు… కుటుంబాన్ని చెల్లాచెదురు చేశారు.. అంటూ బాధపడిపోతున్నారు.

ఇదే సమయంలో చంద్రబాబు కొన్ని ప్రశ్నలు ఇబ్బంది పెడుతున్నాయి.. అవేమిటంటే..కోడెలపై కేసులపై తెగబాధపడిపోతున్న చంద్రబాబు…గతంలో జగన్ పై పెట్టిన కేసుల గురించి ఏం సమాధానం చెబుతారు. జగన్ పై పెట్టిన కేసులు వేధింపుల జాబితాలోకి రావా..? కోడెల పై జగన్ వేధింపుల కోసం కేసులు పెట్టినప్పుడు చంద్రబాబు ఎందుకు కోడెలకు అండగా నిలవలేదు.. ఈ కేసుల గురించి ఒక్కసారి కూడా ఎందుకు మీడియా ముందు మాట్లాడలేదు.. కోడెలను ప్రభుత్వం వేధిస్తుందని గొంతెత్తలేదు…?

ఒకవేళ జగన్ సర్కారు వేధింపుల కోసం కేసులు పెట్టినా.. టైగర్ వంటి పేరున్న కోడెల ఎందుకు భయపడ్డారు. ..? పలనాటి పులిగా పేరున్న వ్యక్తి అక్రమ కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకుంటారా.. ? ఎన్టీఆర్ హయాంలో పులిగా పేరున్న వ్యక్తి చంద్రబాబు నాయకత్వం మొదలయ్యాకే తన ప్రతిష్ట కోల్పోవడం మొదలుపెట్టారంటే… అందులో చంద్రబాబు పాత్ర లేదా..? ఇలాంటి ప్రశ్నలకు చంద్రబాబు ఎప్పటికైనా సమాధానం చెబుతారా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here