కత్తి మహేష్ కు వైసిపికి సంబందం ఉందా. కత్తి మహేష్ వైసిపి లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారా. ఇది ఏ మైనా వైసిపి నుండి అధికారికంగా వచ్చిన సమచారమా. ఎందుకీ దుష్ప్రచారం. కత్తి మహేష్ కు తెలుగు మీడియా ఛానళ్ల లో ఎవరు అంతగా ప్రాధాన్యత ఇచ్చింది. తెలుగుదేశం మద్దతుగా నిలచే ఛానళ్లలోనే కత్తి మహేష్ కు ఎక్కువ అవకాశం కల్పించారు. పవన్ కళ్యాన్ పై కత్తి మహేష్ కామెంట్లు చేయటం వాటి పై స్టూడియోల్లో కత్తి మహే్ పవన్ కళ్యాన్ అభిమాను లను చర్చకు పిలిచి గంటలకు గంటలు చర్చలు సాగదీసారు. రేటింగ్స్ కోసం కత్తి మహేప్ ఎపిసోడ్ ను సీరియల్ ను తల పించేలా నడిపించారు.
పవన్ ఫ్యాన్స్ ను వైసిపి పై రెచ్చ గొట్టటం కోసం అప్పట్లోనే కత్తి మహేష్ వైసిపి లో చేరుతున్నారని వైసిపి నుండి పోటీ చేయాలనుకుంటున్నారని సృష్టించారు. దీని పై కత్తి మహేష్ సైతం సమాధానం చెప్పారు. తాను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తినని స్పష్టం చేసారు. ఇక, రాముడి గురించి రామాయణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హైదరాబాద్ నగర బహిష్కరణ కు గురైన కత్తి మహేష్ వైసిపి లో చేరి ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా నుండి పోటీ చేయాల నుకుంటున్నారంటూ మరో సారి వాదనను పచ్చ మీడియా తెర మీదకు తెచ్చింది. కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలతో కొందరి మనోభావాలు దెబ్బ తిన్నాయి.
ఇటువంటి వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు పెరుగతాయనే కారణంతో తెలంగాణ ప్రభు త్వం కత్తి మహేష్ తో పాటుగా పరిపూర్ణానంద స్వామి ని నగర బహష్కరణ చేసారు. అదే సమయంలో టివి ఛానళ్లను సై తం తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. వివాదాస్పద చర్చలు నిర్వహించవద్దని సూచించింది. అయితే, తాజాగా ఈ విషయాన్ని ఏపి లో ప్రతిపక్ష పార్టీ వైసిపి పై బురద చల్లటానికి ఒక వర్గం ప్రజలపై పరోక్షంగా ప్రభావం పడే విధంగా కత్తి మహేష్ వైసిపి నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇందులో వారి ఉద్దేశం ఏంటనేది స్పష్టంగా కనిపిస్తోంది.
జగన్ తిరుమల వెళ్లినా వివాదాస్పదమే, జగన్ పుష్కర స్నానం చేసినా వివాదాస్పదమే, ఇక ఎక్కడ ఏం జరిగినా వైసిపికి లింకులు అంట గడుతూ పార్టీని డామేజ్ చేయటమే లక్ష్యంగా పచ్చ మీడియా శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. మరి వైసిపి నేతలు ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం లేదనుకుంటే ఇదే రకమైన ప్రచారం ఎన్నికల ముందు మరింతగా పెరిగే అవకాశం ఉంది.