గ్రామ సచివాలయాల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది….!!

0
1081
గ్రామ సచివాలయాల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది....!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ముఖమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునుండి రాష్ట్రంలో పాలనను చాలావరకు మెరుగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు అనే చెప్పాలి. ఇక ఇప్పటికే వారి మ్యానిఫెస్టో లోని పలు పథకాలను అమలు చేసిన సీఎం, గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల ప్రారంభంపై గట్టిగా దృష్టి పెట్టారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహించి వాటి ఫలితాలను కూడా వెల్లడించడం జరిగింది. ఈ గ్రామ సచివాలయాలను అక్టోబర్ 2న గాంధీ మహాత్ముని జయంతి నాడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభించనున్నారు.

ఇకపోతే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట మరెక్కడైనా సరే నియమించాలని నిర్ణయించింది ప్రభుత్వం. అలానే ఉద్యోగి సొంత మండలంలో మరేదైనా గ్రామమైనా, లేదా జిల్లాలో మరెక్కడైనా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. పోస్టింగ్‌ కోసం సొంత జిల్లాలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని అభ్యర్ధికి ప్రభుత్వం కల్పించబోతోంది. ఇక ప్రభుత్వం నుండి అందుతున్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 11,158 గ్రామ సచివాలయాలు కాగా, మరొక 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటుకానున్నాయి. ఇవి మొత్తం కలిపి 14,944 గా ఉండనున్నాయి. నేడు విజయవాడలోని ఏ ప్లస్ కన్వేషన్ సెంటర్ లో నిర్వహించిన కార్యకమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్న సభలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందచేయడం జరిగింది.

వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా వారు కోరుకున్న ప్రాంతంలోనే పోస్టింగ్‌ ఇస్తారు. ఒకే గ్రామ సచివాలయంలో ఒకే పోస్టుకు ఇద్దరు ముగ్గురు పోటీపడినప్పుడు ఉద్యోగులు కోరుకున్న రెండు, మూడు స్థానాల్లో అవకాశం కల్పిస్తారు. భారత దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద రిక్రూట్మెంట్ అని, అలానే గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఎంపిక అయిన ప్రతిఒ క్కరూ కూడా ఎంతో బాధ్యతతో తమ పనిని సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, రాబోయే రోజుల్లో యువతకు మరింత పెద్ద పీట వేసేలా ఉద్యోగాలు కల్పించే విధంగా సీఎం గారు ఆలోచన చేస్తున్నట్లు పలువు మంత్రులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here