చంద్రబాబు నివాసం కూల్చివేతకు రంగం సిద్దం!! వారం రోజులే సమయం: సీఆర్డీఏ డెడ్ లైన్..!!

0
909

రాజకీయ దుమారానికి కారణమైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వ్యవహారం మరో సారి తెర మీదకు వచ్చింది. గతంలోనే అక్రమంగా నిర్మించిన ఈ నివాసాన్ని ఎందుకు తొలిగించకూడదంటూ స్థానిక అధికారులు నోటీసులు జారీ చేసారు. అయిేత..దీని పైన అన్ని పత్రాలు సమర్పిస్తామని నాడు భవన యజమానులు సమాధానం ఇచ్చారు. వారు కోరిన సమయం ముగిసింది. దీంతో..మరోసారి సీఆర్డీఏ అధికారు లు చంద్రబాబు ఉంటున్న నివాసానికి నోటీసులు అంటించారు. వారంలోగా ఆయన ఉంటున్న నివాసాన్ని తొలిగించాలని..లేకుంటే తామే తొలిగిస్తామంటూ సీఆర్డీఏ అధికారులు ఆ ఇంటికి నోటీసులు అంటించారు. ఈ మేరకు భవన యజమాని లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. ఇప్పుడు దీని పైన ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారారు..తిరిగి ఇది రాజకీయంగా ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

చంద్రబాబు నివాసంపై సీఆర్ఢీఏ డెడ్ లైన్…! మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో నివాసం ఉంటున్న భవనానికి సీఆర్ఢీఏ అధికారులు నోటీసులు అంటించారు. ఆయన ఉంటున్న భవన యజమాని లింగమనేని రమేష్ పేరుతో తాజాగా ఈ నోటీసులు జారీ అయ్యాయి. అందులో గతంలో ప్రజా వేదిక కూల్చిన సమయంలో జారీ చేసిన నోటీసులను ప్రస్తావిస్తూ కొత్తగా డెడ్ లైన్ విధించారు. ఇప్పుడు ఏకంగా భనవం కూల్చివేస్తామంటూ అల్టిమేటం జారీ చేసారు.

ఆ నోటీసులను చంద్రబాబు నివాసం ఉంటున్న భవనానికి అంటించారు. ప్రస్తుతం చంద్రబాబు నివసిస్తున్న ఆ భవనాన్ని వారం రోజుల లోగా తొలిగించాలని..లేకుంటే తామే వాటిని తొలిగిస్తామని సీఆర్ఢీఏ అధికారులు అందులో స్పష్టం చేసారు. నది గరిష్ఠ వరదనీట మట్టం లోపల ఈ భవనం 1.318 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారని అందులో పేర్కొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్.. ఫస్ట్ ఫ్లోర్.. స్విమ్మింగ్ పూల్.. గ్రౌండ్ ఫ్లోర్ లో డ్రస్సింగ్ రూమ్ వంటి నిర్మాణాలన్నీ నియమ నిబంధనలను అతిక్రమించి చేపట్టారని..వీటికి అనుమతులు లేవని నోటీసులో స్పష్టం చేసింది. వీటికి ఎందుకు తొలిగించకూడదో స్పష్టం చేయాలని కోరుతూ గతంలోనే నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసారు. అయితే, తగిన అనుమతులు ఉన్నాయని.. వాటి పత్రాలను సమర్పిస్తామని చెప్పి..చెప్పిన సమయంలోగా అంద చేయలేదని దీంతో.. ఈ అక్రమ నిర్మాణాలను వారం రోజుల్లోగా తొలిగించాలని..లేకపోతే తామే వీటిని తొలిగిస్తామని ఆ నోటీసులు అధికారులు స్పష్టం చేసారు.

మిగిలిన భవనాలకు… రాజకీయంగా దుమారం తప్పదా.
ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఉంటున్న భవనం కూల్చివేస్తామని..అందునా వారం రోజుల సమయమే ఫిక్స్ చేయటంతో ఇది ఖచ్చితంగా రాజకీయంగా దుమారానికి కారణమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే ఇతర భవనాలను నోటీసులు ఇవ్వగా..వారిలో కొందరు న్యాయ పోరాటానికి దిగారు. ప్రజా వేదిక కూల్చిన సమయం నుండే ఈ వివాదం మొదలైంది. ఇక..ఇప్పుడు భవన యజమానికి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. లింగమనేని రమేష్ స్పందన ఇప్పుడు కీలకం కానుంది. కొద్ది రోజుల క్రితం క్రిష్ణా నదీకి వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబు నివాస ప్రాంగణంలోకి వరద నీరు వచ్చింది. అయితే ప్రభుత్వ ఉద్దేశ పూర్వకంగానే తన ఇంటిని ముంచే ప్రయత్నం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఆయన నివాసం వద్దకు మంత్రులు వెళ్లిన సమయంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ వివాదం సద్దుమణిగిన సమయంలో..ఇప్పుడు తిరిగి సీఆర్డీఏ నోటీసుల ద్వారా మరో సారి టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు మొదలు పెట్టటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. నోటీసులకు సమాధానం ఇస్తూ..సమయం కోరుతారా లేక న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారా అనేది చూడాలి. అయితే..ప్రభుత్వం మాత్రం కరకట్ట వద్ద నిబంధనలను అతిక్రమించి చేసిన నిర్మాణాల విషయంలో మాత్రం ఎంత ఒత్తిడి వచ్చిన కఠినంగానే ఉండాలని భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here