చీప్ పబ్లిసిటీ కోసం పాకులాట… పవన్ కి విజయసాయి రెడ్డి చురకలు

0
1086

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఆ పార్టీ నేతలపై విమర్శలు చేసే విజయసాయి… ఈ సారి జనసేన అధినేత పవన్ ని టార్గెట్ చేశారు. పవన్ చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతిలో పర్యటించిన సంగతి తెలిసిందే. రాజధానిని మారుస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అక్కడ పవన్ పర్యటించి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మద్దుతగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం జగన్ పై విమర్శలు చేశారు. కాగా… జగన్ పై పవన్ చేసిన విమర్శలను తాజాగా విజయసాయి రెడ్డి తొప్పి కొట్టే ప్రయత్నం చేశారు.

చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడకుండా…నిర్మాణాత్మక విమర్శలు చేస్తే మంచిదని హితవు పలికారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృధా కాకుండా సీఎం జగన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. అదే సమయంలో పారదర్శక పాలనలో యావత్ దేశానికే జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here