జగన్ మీద జేడీ ప్రశంసల వర్షం .. ఇది కదా అసలైన దెబ్బ !

0
986

ఎవరికైనా ప్రత్యర్థుల చేత పొగిడించుంటే వచ్చే కిక్కే వేరు. అది రాజకీయాల్లో అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇప్పుడు జగన్ మీద జేడీ ప్రశంసలు కురిపించడం ఆసక్తిని రేపుతోంది. జగన్ తన మ్యానిఫెస్టోలో దశలవారీగా మధ్య పాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పిన సంగతీ తెలిసిందే. ఈ పధకం అమలు సాధ్యం కాదని ఏకంగా జనసేన అధినేత కూడా సెలవిచ్చారు. కానీ అదే పార్టీలో ఉన్న జేడీ మాత్రం ఈ పధకం విషయంలో జగన్మ్ మీద ప్రశంసలు కురిపించారు. జేడీ మాట్లాడుతూ .. మధ్య పాన నిషేధం దిశగా జగన్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తాయని సమాజానికి ఇది ఎంతో మేలును కలుగుజేస్తుందని చెప్పు కొచ్చారు.

రాజకీయాలో ప్రత్యర్థి మీద విమర్శలు తప్పితే ప్రశంసలు రావటం ఈ రోజుల్లో అసాధ్యం అయిపోయింది. కానీ జేడీ మాత్రం సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా జగన్ ను మెచ్చుకోవటం రాజకీయాల్లో మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పటికే జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టే మద్యపాన నిషేధం దశల వారీగా విధించడానికి చర్యలు మొదలుపెట్టారు. తోలి విడతలో ప్రభుత్వం అన్ని ప్రవైట్ లైసెన్సులను రద్దు చేసి .. వైన్ షాపులను తమ ఆధీనంలోకి తీసుకుంది.

మునుపటి కంటే మధ్యం దుకాణాలు బాగా తగ్గిపోయాయి. దీనితో అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. నిజంగా ఇది జగన్ సాధించిన విజయంగా చెప్పుకోవాలి. మధ్యం సేల్ ను కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ పధకం సాధ్యం కాదని ప్రతి పక్షాలు ఆరోపణలు చేసిన జగన్ అమలు చేయాలనీ .. చిత్త శుద్దితో పని చేస్తున్నారని అర్ధం అవుతుంది. జగన్ మధ్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయగలిగితే మిగతా రాష్ట్రాలకు కూడా ఏపీ ఆదర్శంగా పని చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here