జగన్ ’రివర్స్’ తో చంద్రబాబుకు షాక్

0
917

జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న రివర్స్ టెండరింగ్ విధానం చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పోలవరం ప్రాజెక్టు 65వ ప్యాకేజీ పనులను రూ. 58 కోట్ల తక్కువకే పనులు దక్కించుకుంది. శుక్రవారం రాత్రి ఓపెన్ చేసిన రూ. 274.25 కోట్ల విలువైన పనులకు రివర్స్ టెండర్ విధానంలో మ్యాక్స్ ఇన్ ఫ్రా కంపెనీ 15.6 శాతం తక్కువ ధరలకే దక్కించుకుంది.

ఎన్నికలకు ముందు ఇదే ప్యాకేజిలోని ఇదే పనిని మ్యాక్ ఇన్ ఫ్రా కంపెనీనే 4. 77 శాతం అధిక ధరకు దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు హయాంలో అధిక ధరలకు దక్కించుకున్న పనులనే కంపెనీ జగన్ ప్రభుత్వంలో మాత్రం 15.6 శాతం తక్కువ కోట్ చేసి పనులను దక్కించుకోవటం విశేషం. అప్పట్లో ఎక్సస్ ఎందుకు కోట్ చేసి పనులను దక్కించుకుంది ? ఇపుడు తక్కువకు ఎందుకు దక్కించుకుంది?

ఎందుకంటే అప్పుడున్నది చంద్రబాబు, ఇపుడున్నది జగన్ అనే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రబాబు హయాంలో జరిగిన ప్రతీ ప్రాజెక్టును చాలా కంపెనీలు ఎక్సస్ ధరలకే పనులను దక్కించుకున్నాయి. దాంతో 100 రూపాయల పనికి చంద్రబాబు ప్రభుత్వం 200 రూపాయలు చెల్లించాల్సొచ్చేది. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టటమే టార్గెట్ గా జగన్ రివర్స్ టెండర్ విధానాన్ని తీసుకొచ్చారు.

ఈ పద్దతిలో టెండర్లు పిలిచి ఓపెన్ చేసిన మొదటి పనిలోనే జగన్ ప్రభుత్వానిక సుమారు రూ. 58 కోట్లు మిగిలాయంటే ఇక వేల కోట్ల విలువైన ప్రధాన పనుల్లో ఇంకెంత మిగులుతాయో అర్ధం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వానికి మిగిలే వేల కోట్ల రూపాయలు చంద్రబాబు హయాంలో అవినీతి జరిగినట్లే అర్ధంకదా ? తన హయాంలో ఇదే మ్యాక్స్ ఇన్ ఫ్రా కంపెనీ 4.77 శాతం అధిక ధరలకు దక్కించుకుని ఇపుడు మాత్రం 15.6 శాతం తక్కువకు ఎలా పని చేయగలుగుతోందో చంద్రబాబు చెప్పగలరా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here