జనసేనకు మరో రాజీనామా..!

0
1161

సార్వత్రిక ఎన్నికల అనంతరం జనసేన పార్టీ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారవుతున్నట్టుగా ఉంది. ఎన్నికల సమయంలో కొందరు ఉత్సాహంతో, మరి కొందరు రాజకీయంపై ఆశలతో ఆ పార్టీలోకి చేరిపోయారు. అయితే ఎన్నికల్లో ఆ పార్టీ చతికిల పడటంతో.. అలాంటివారు చాలామంది నిస్పృహకు గురయ్యారు. ఎన్నికల తర్వాత కూడా పవన్ కల్యాణ్ తీరులో పెద్దగా మార్పులేదు.

ఆయన యథారీతిన చంద్రబాబు నాయుడి అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నారని తేటతెల్లం అవుతూ ఉంది. దీంతో ఎన్నికల తర్వాత ఆయన బాధ్యతలు అప్పగించిన వారు కూడా పార్టీకి దూరం అవుతూ ఉన్నారు. జనసేనకు ప్రజాకర్షక నేతలు అనుకున్నవారు చాలామంది ఇప్పుడు చప్పుడు చేయడంలేదు. జనసేన తరఫున పోటీచేసిన, నిష్టాగరిష్టుడుగా బిల్డప్ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా ఇప్పుడు అడ్రస్ లేకుండాపోయారు.

అదలాఉంటే.. జనసేనకు పార్థసారథి అనే నేత రాజీనామా చేశారు. ఈయన ఎన్నికల్లో ఎంపీగా పోటీచేశారట. అలా ఓడిపోయిన వారు ఆ పార్టీకి దూరం కావడం విడ్డూరం ఏమీకాదు. అయితే ఈయనకు ఇటీవల కూడా పవన్ కల్యాణ్ బాధ్యతలు తప్పించారట. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మానిటరింగ్ చేసి, పార్టీ తరఫున మాట్లాడే బాధ్యతలు ఈయనకు ఇచ్చారట పవన్ కల్యాణ్.

అయితే ఆయన ఆ బాధ్యతలు కూడా వద్దంటూ జనసేనకు రాజీనామా చేసినట్టుగా సమాచారం. ఇలాంటి వారు ఏ పార్టీలోకి చేరతారు అనేదాని కన్నా.. జనసేనకు ఒక్కొక్కరుగా దూరం అవుతూ ఉండటం మాత్రం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here