దళితులను దూషించిన కేసులో చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో చింతమనేని అజ్ఞాతంలో ఉన్నారు అన్న విషయం కూడా ఏపీలో చర్చనీయాంశంగా మారింది. చింతమనేని పై ఇప్పటి వరకు 50 కేసులున్నాయని, పోలీసులు చింతమనేని కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. చింతమనేనిని పట్టుకోడానికి 12 బృందాలు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నేడు పలు నాటకీయ పరిణామాల మధ్య చింతమనేనిని అరెస్ట్ చేశారు .
భార్యకు ఆరోగ్యం బాలేదని ఇంటికి వచ్చిన చింతమనేని .. పోలీసుల అరెస్ట్ అజ్ఞాతంలో ఉన్న , 12 రోజులుగా పట్టుబడని చింతమనేని భార్యకు బాగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో దుగ్గిరాలలోని నివాసానికి వచ్చారు. దీంతో చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఏపీ రాష్ట్రంలో ఛలో పల్నాడు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే చింతమనేని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఛలో పల్నాడుకు టీడీపీ నేతల తరలింపు జరుగుతుంది అని భావించిన నేపధ్యంలోనే చింతమనేనిని పట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తనపై ఉన్న కేసుల కారణంగా గత కొంత కాలంగా అజ్ఞాతంలో ఉన్న చింతమనేని ప్రభాకర్ నేడు ఇంటికి రావడం తో ఈ విషయం తెలిసిన పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. దీంతో చింతమనేని ఇంటిదగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం చింతమనేని ఇంట్లో సోదాలు నిర్వహించారు.
చింతమనేని అరెస్ట్ తో ఉద్రిక్తత .. దుగ్గిరాలలో భారీగా పోలీసులు చింతమనేని అనుచరులు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చింతమనేని ఇప్పటికే పోలీసులకు లొంగి పోతామని చెప్పారని, అయినప్పటికీ పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చింతమనేని అనుచరులు ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో నెలకొన్న హైడ్రామా తో దుగ్గిరాల లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది . చింతమనేని ఇంట్లోనే ఉన్నాడు అని గుర్తించిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత 12 రోజులుగా చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలో ఉన్నారు. చింతమనేని పట్టుకోవడానికి పోలీసులు సీరియస్ గా ప్రయత్నం చేశారు. ఇక దళితులు దూషించిన కేసు మాత్రమే కాకుండా , చింతమనేని పై కేసు పెట్టిన వారిని చంపుతానని హెచ్చరించారని మరోమారు చింతమనేని పై కేసు నమోదు చేశారు పోలీసులు.
చింతమనేని వ్యవహారం చాలా సీరియస్ గా తీసుకున్న జగన్ సర్కార్ .. 12 రోజుల తర్వాత అరెస్ట్. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసుల వ్యవహారం జగన్ సర్కార్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. చింతమనేని ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించి నేడు ఆయనను అరెస్ట్ చేశారు . అయితే చింతమనేని ఏలూరు కోర్టులో లొంగిపోతాడన్న ప్రచారం జరిగింది. ఆయన అరెస్ట్‌కు సంబంధించి దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఎట్టకేలకు నేడు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.