డైరెక్టుగా లోకేష్ మీద.. ఇన్ డైరెక్టుగా పవన్ మీద!

0
1166

తెలుగుదేశం నేత, ఎమ్మెల్సీ లోకేష్ మీద విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి. రేషన్ బియ్యం మీద ట్వీట్లతో తెలుగుదేశం పార్టీ వాళ్లు తప్పుడు ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గడ్డలు కట్టిన బియ్యం అంటూ వేర్వేరు ప్రాంతాల నుంచి ఒకే ఫొటోను వాడి తెలుగుదేశం వాళ్లు ట్వీట్లు చేశారు. జనాలకు ఇంకా బియ్యం అయినా చేరాయో లేదో.. ఫేక్ ఫొటోలతో తెలుగుదేశం వాళ్లు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి స్పందించారు.

‘మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు ఏపీ సీఎం గారు. ఆ బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంట లోపలే క్షుద్ర దాడి మొదలుపెట్టారు పచ్చదొంగలు..’ అంటూ నారా లోకేష్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.

ఇక పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా ధ్వజమెత్తారాయన. ‘ఉద్దానం చుట్టూ అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తి ఇప్పుడు అక్కడేం జరుగుతుందో చూడలేక కళ్లు మూసుకున్నాడు. 200 పడకల కిడ్నీ రీసెర్చి సెంటర్ వస్తోంది. మెట్రోలలో తప్ప రాష్ట్రాల రాజధానుల్లో కూడా లేని సదుపాయం. ఉక్కు సంకల్పం నుంచి పుట్టుకొచ్చింది. ‘గాలి’మాటల నుంచి కాదు!’ అంటూ ట్వీట్ చేశారు.

‘బాసేమో 18 కేసుల్లో స్టే తెచ్చుకుని తాను పత్తిగింజనని చెప్పుకుంటారు. బానిసలేమో పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తే కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. మూడుపూటలా ఇసుక బొక్కినోళ్లకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుస్తుంది..’ అంటూ మరో ట్వీట్ లో ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here