నాగచైతన్య మొదటి భార్య గురిచి షాకింగ్ న్యూస్ బయటపెట్టిన సమంత !

0
998

సినిమా సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ తెలుసుకుందామని అందరికీ విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అదే ఆసక్తిని క్యాష్ చేసుకుందామని మంచు లక్ష్మి ఒక ప్రముఖ ఛానల్ కోసం నిర్వహిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ కార్యక్రమం ప్రారంభం అయింది. తారల పడక గది రహస్యాలు సరదాగా అందరికీ షేర్ చేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసారు.

ఈ షో సిరీస్ లో మంచు లక్ష్మి సమంతతో తన షోను ప్రారంభించింది. చైతన్యతో ప్రేమ ఆపై పెళ్ళికి సంబంధించి చాలామందికి తెలియని కొన్ని సీక్రెట్స్ చెప్పమని మంచులక్ష్మి సమంతను అడిగింది. దీనికి కొద్దిసేపు సమంత మౌనం వహించడంతో చైతన్యతో పెళ్ళికి ముందు మీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అన్న విషయం తనకు తెలుసు అంటూ జోక్ చేసింది.

దీనితో నవ్వుతూ సమంత చైతూకి సంబంధించిన అనేక విషయాలను షేర్ చేస్తూ చైతన్యకు ఉన్న మొదటి భార్య సీక్రెట్ ను బయటపెట్టింది. చైతన్యకు తనకన్నా తన బెడ్ పై ఉండే పిల్లోస్ అంటే చాల ఇష్టమని ఆఖరికి తాను చైతన్యను ముద్దు పెట్టుకోవాలి అని భావించినా తమ మధ్య అడ్డుగా ఆ పిల్లోస్ ఉంటాయని జోక్ చేస్తూ తమ బెడ్ రూమ్ రహస్యాలను బయటపెట్టింది.

అంతేకాదు బయటకు ఎంతో సాంతంగా కనిపించే చైతన్యకు ఉన్న కోపాన్ని పిల్లలు అన్నా జంతువులు అన్నా చైతన్యకు ఉన్న ప్రేమకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఈ షోలో సమంత మంచు లక్ష్మితో షేర్ చేసింది. ప్రముఖ సెలెబ్రెటీలు అనేకమంది పాల్గొనబోయే ఈ కార్యక్రమం ద్వారా తారల బెడ్ రూమ్ రహస్యాలను ఓపెన్ సీక్రెట్ గా మార్చి మంచు లక్ష్మి మరో టాక్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తోంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here