నాగ శౌర్య ఏఏన్ ఆర్ టైటిల్ తో వస్తున్నాడా ?

0
995

యంగ్ హీరో నాగ శౌర్య డిఫెరెంట్ కథాంశాలను ఎన్నుకుంటున్నాడు.2018 లో నాగ శౌర్య నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.మొదటగా వచ్చిన ఛలో సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఛలో సినిమా లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. యాక్షన్ మరియు కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమాలో నాగ శౌర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఛలో తరువాత ఆయన నటించిన “కణం” సినిమా రిలీజ్ అయ్యంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు మరియు తమిళంలో ఒకే సారి తెరకెక్కింది. హరర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత అమ్మగారిల్లు సినిమాలో నటించాడు.ఈ సినిమా ఫ్లామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.. శామిలి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సూర్య దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఆశించిన రీతిలో విజయం సాధించలేదు. ఆగస్టు లో నర్తనశాల సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.

రీసెంట్ గా హిట్ అయిన ఓ బేబి సినిమా లో గెస్ట్ రోల్ చేశాడు. ఈ సినిమాలో సమంత నాగశౌర్య మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్ల్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి . ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నరని ఆఫిషియల్ గా అనౌన్స్ చేశారు.ఈ సినిమా కి అక్కినేని నాగేశ్వరరావు హీరో గా నటించిన “మూగ మనసులు” పేరును అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. టైటిల్ మాత్రమే కాకుండా సినిమా కాన్సెప్ట్ కూడా పునర్జన్మల నేపథ్యంలోనే ఉంటుందని అంటున్నారు. ఈ విషయాలపై అధికారిక ప్రకటన చేయలేదు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నఈ సినిమా తో లక్ష్మీ సౌజన్య’ అనే నూతన దర్శకురాలు తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఈ సినిమా అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here