బన్నీ -సుకుమార్ మూవీ అప్డేట్

0
1073

రంగస్థలం తరువాత ఏడాది గ్యాప్ తీసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేయనున్నాడు. ఈసినిమాకు స్క్రిప్ట్ లాక్ అయ్యింది. అక్టోబర్ 3 నుండి ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సుకుమార్ , బన్నీ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య , ఆర్య 2 చిత్రాలు తెరకెక్కాయి. అందులో ఆర్య సూపర్ హిట్ అవ్వగా , ఆర్య 2 యావరేజ్ అనిపించుకుంది. మరి ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈమూడో సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ప్రస్తుతం బన్నీ , త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘అల వైకుంఠపురములో.. అనే చిత్రం లో నటిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ కి జోడిగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. బన్నీకి త్రివిక్రమ్ తో కూడా ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో తెరకెక్కిన జులాయి , సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలను సాధించాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

ఇక బన్నీ.. త్రివిక్రమ్ , సుకుమార్ లతో సినిమాలను పూర్తి చేశాక ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ‘ఐకాన్’ అనే చిత్రంలో నటించనున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఫై దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here