బ్రేకింగ్ న్యూస్ : బీజేపీలోకి ఆదినారాయణ రెడ్డి !

0
995
Telugu hunt

అందరూ అనుకున్నదే జరిగిందే .. కొన్ని రోజుల నుంచి మాజీ టీడీపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి బీజేపీలోకి చేరతాడని ఊహాగానాలు వచ్చాయి.ఇప్పుడు అది నిజం కాబోతుంది. ఆదినారాయణ రెడ్డి నిన్న 10 గంటలకు ఢిల్లీలో అమిత్ షాను కలవడానికి బయలుదేరారు. పార్టీ మారవద్దని చంద్రబాబు .. ఆదికి ఎంత చెప్పినా వినలేదని తెలుస్తుంది. అయితే టీడీపీ అధికారంలో చంద్రబాబు విచ్చలవిడిగా ఫిరాయింపులును ప్రోత్సహించి చాలా మందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు వారందరు చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. ముఖ్యంగా కడప ఫైర్ బ్రాండ్ ఆది నారాయణ రెడ్డి అయితే చంద్రబాబుకు మొహం చాటేస్తున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించలేదు.

నిజానికి చంద్రబాబు .. ఆది నారాయణను అడ్డం పెట్టుకొని కడపలో గెలవాలని అనుకున్నారు. కానీ మొత్తం రివర్స్ అయ్యింది. ఆది నారాయణ రెడ్డి 2014 లో వైసీపీ తరుపున పోటీ చేసి కొన్ని నెలలకే టీడీపీ పార్టీలోకి దూకేసి జగన్ కు నమ్మక ద్రోహం చేశారు. అయితే వైసీపీ పార్టీ నుంచి చాలా మంది ఫిరాయించిన మనకు ఆది నారాయణ రెడ్డి మాత్రం మనకు గుర్తుకు వస్తారు. ఎందుకంటే జగన్ మీద ఘోరంగా విరుచుకుపడిన నేతల్లో అది నారాయణ రెడ్డి ఒకరు. చంద్రబాబు మెప్పు కోసం మీడియా ముందుకు వచ్చి జగన్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు. చాలా సార్లు తన స్థాయిని దాటి జగన్ ని విమర్శించేవారు.

టీడీపీలో మంత్రి పదవిని కూడా దక్కించుకోవటంతో ఓ రేంజ్ లో రెచ్చిపోయేవాడు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందని చెప్పాలి. 2019 ఎన్నికల్లో అది నారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక టీడీపీ పార్టీ అయితే నామరూపాలు లేకుండా పోయింది. ఇక కడపలో అయితే టీడీపీ జెండా ఎగరకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆది నారాయణ రెడ్డి బయటికి కూడా రావటం లేదు. మీడియా ముందుకు కనిపించడం లేదు. ఇక ఈ రోజు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరడమే మిగిలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here