మెగాస్టార్ విశ్వరూపం.. అరాచకానికి మరో అర్థం.. సైరా ట్రైలర్ చూడండి

0
1258

ప్రస్తుతం సినీ సినీ అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్ర ఫీవర్ నెలకొని ఉంది. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం సినీ సినీ అభిమానుల్లో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్ర ఫీవర్ నెలకొని ఉంది. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సినీ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సైరా ట్రైలర్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ దాదాపు మూడు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆరు పదుల వయసులో సైతం ప్రతి సన్నివేశాన్ని ప్రాణం పెట్టి నటించాడు.

యాక్షన్ సన్నివేశాలు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి తన విజన్ ని కేవలం మూడు నిమిషాల్లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. చిరు యాక్షన్ ఎపిసోడ్స్ లో అరాచకమే ఇది అనే విధంగా రెచ్చిపోయారు.

భారత మాతకి జై అంటూ సైరా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. నరసింహారెడ్డి సామాన్యుడు కాదు. అతను కారణ జన్ముడు.. అతనొక యోగి.. అతనొక యోధుడు.. అతనిని ఎవరూ ఆపలేరు అంటూ అనుష్క బ్యాగ్రౌండ్ లో చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో నరసింహారెడ్డి పాత్ర పరిచయం ప్రారంభం అవుతుంది.

పర్ఫెక్ట్ గా డిజైన్ చేసిన కొన్ని యాక్షన్ సన్నివేశాలని ట్రైలర్ లో చూపించారు. ఈ భూమ్మీద పుట్టింది మేము.. ఈ మట్టిలో కలిసేది మేము నీకెందుకు కట్టాలిరా శిస్తు అంటూ చిరంజీవి బ్రిటిష్ వారిని వార్నింగ్ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.

నరసింహారెడ్డిని ప్రజలు ఎంతగా అభిమానిస్తారో ట్రైలర్ లో ఎమోషనల్ గా చూపించారు. నరసింహారెడ్డి ఎక్కడున్నాడో చెప్పండి అని అడగగా మా గుండెల్లో ఉన్నాడని ప్రజలు సమాధానం ఇస్తారు.. అయితే అక్కడే కాల్చండి అంటూ బ్రిటిష్ అధికారి ఆదేశం ఇస్తాడు.

ట్రైలర్ చివర్లో నే చివరి కోరిక ఏంటని అడగగా ‘గెట్ అవుట్ ఫ్రమ్ మై మథర్ ల్యాండ్’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here