మోడీ 100 రోజుల పాలన, మీడియా ముందుకు నిర్మలా సీతారామన్

0
1164

చెన్నై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు (10 సెప్టెంబర్ 2019) మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మోడీ 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో అభివృద్ధిని మెరుగుపర్చడం- 100 రోజుల పాలనలో సాహసోపేత కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాత్మక చర్యలు అనే అంశంపై ఆమె మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ప్రపంచ మార్కెట్ ప్రభావంతో దేశంలో ఆటో సేల్స్ భారీగా పడిపోయాయి. క్వార్టర్ 1 జీడీపీ 5 శాతానికి పరిమితమైంది. ఆగస్ట్ నెలలో పాసింజర్ వెహికిల్స్ సేల్స్ భారీగా తగ్గిపోయినట్లు SIAM నివేదిక వెల్లడించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71.50 కంటే పైగా ఉంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు.

నరేంద్ర మోడీ వంద రోజుల పాలనపై నిర్మలా సీతారామన్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఆటో ఇండస్ట్రీ తీవ్ర మాంద్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆటో ఇండస్ట్రీపై ఇండస్ట్రీ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటామని నిర్మల చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here