రాప్తాడు లోనూ అదే ప‌రిస్థితి..!! టిడిపి కంచుకోట‌ల‌పై వైసిపి జెండా ఖాయం. – YSRCP Raptadu MLA Candidate Face to Face Paritala Family

0
1074

రాప్తాడు లోనూ అదే ప‌రిస్థితి..!!
టిడిపి కంచుకోట‌ల‌పై వైసిపి జెండా ఖాయం..!!

అనంతో వైసిపి పాగా ఖాయం. టిడిపి కంచుకోట‌లో టిడిపి సీన్ రివ‌ర్స్. 2014 అనుకూలించిన ప‌రిస్థితులు ఇప్పుడు పూర్తి ప్ర‌తికూలంగా మారాయి. ఈ జిల్లాలో అధికార పార్టీలో ఆధిప‌త్య పోరు నెల‌కొంటే..వైసిపి చాప కింద నీరు బ‌లోపేతం అవుతోంది. ఇక్క‌డ అధికార పార్టీలో ఎంపీలంటే ఎమ్మెల్యేలకు సరిపడటం లేదు.. ఎమ్మెల్యేలంటే ఎంపీలకు పడటం లేదు. జెసి బ్ర‌ద‌ర్స్‌…ప్ర‌భాక‌ర చౌద‌రి మ‌ధ్య గ్యాప్ పూడ్చ‌లేని స్థాయికి చేరిపోయింది. కేవ‌లం తాడిప‌త్రి, అనంత‌పురం అర్బ‌న్ మాత్ర‌మే కాకుండా గుంత‌క‌ల్లులో నూత‌న మాటే చెల్లుబాటు అయ్యేలా జెసి ప్ర‌య‌త్నిస్తున్నారు.

అక్క‌డ జితేంద్ర గౌడ్ ను కాద‌ని మ‌ధు సూధ‌న్ గుప్తాను తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాయదుర్గంలో మంత్రి కాలవ వర్గానికి ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వర్గానికి అస్సలు పడటం లేదు.. మెట్టు గోవిందరెడ్డి వర్గం కూడా త‌న అధిప‌త్యం కోసం పోరాటం చేస్తోంది. కల్యాణదుర్గం నియోజకవర్గంలోనూ  మంత్రికి.. ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి పడటం లేదు. వ‌చ్చే ఎన్నికల్లో చాలా చోట్ల కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఎంపీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లాలో కలకలం రేపాయి. క‌దిరిలో ఎమ్మెల్యే చాంద్ బాషా. మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ మధ్య గ్యాప్‌ చాలా పెరిగింది. తన కుమారుడికి పుట్టపర్తి టికెట్‌ ఇప్పించాలని ఎంపీ నిమ్మల కిష్టప్ప తెగ ప్రయత్నిస్తున్నారు.. పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథికి నిమ్మల కిష్టప్పకు క్షణం పడటం లేదు. రాప్తాడు ఎమ్మెల్యే .. మంత్రి సునీతకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఉంది. కొందరు నేతలు పనిగట్టుకుని తమపై బురద జల్లుతున్నారని మంత్రి కుమారుడు పరిటాల శ్రీరామ్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తమను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణకు కూడా సొంత పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే స‌మ‌యంలో అనంత‌పురంలో జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా టిక్కెట్ల కేటాయింపు పై దాదాపు ఓ క్లారిటీకి వ‌చ్చేసారు. అక్క‌డ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపే ల‌క్ష్యంగా వైసిపి నేత‌లు ముందుకు క‌దులుతున్నారు. టిడిపి లో నెల‌కొన్ని ప‌రిస్థితుల‌ను చ‌క్క దిద్దేందుకు టిడిపి అధినేత వ‌రుస స‌మావేశాలు ఏర్పాటు చేసినా ఫ‌లితం ఇవ్వ‌టం లేదు.దీనిని అనుకూలంగా మ‌ల‌చుకొని టిడిపి కంచుకోట పై వైసిపి జెండా ఎగ‌ర‌వేయ‌ట‌మే ల‌క్ష్యంగా వైసిపి అడుగులు వేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here