రెడ్డి చూపు వైసీపి వైపు..! మారనున్న విశాఖ రాజకీయ సమీకరణాలు..!!

0
1237

అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారుతున్నాయి. అదికార వైసిపి ప్రభుత్వానికి తగ్గరవ్వాలని పార్టీలకతీతంగా నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కోవలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా చెలామణి అవుతున్న నేతలు కూడా ఉన్నట్టు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత టీ. సుబ్బరామి రెడ్డి వైసీపీ పార్టీలోకి చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాల సుదీర్ఘమైన అనుబంధం ఉన్న సుబ్బరామి రెడ్డికి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నుంచి రాజీవ్ గాంధీతో పాటు ప్రస్తుత ఏఐసీసీ అద్యక్షురాలు సోనియా గాంధీ వరకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సైతం రాజ్యసభ పదవి సొంతం చేసుకున్నారు సుబ్బరామి రెడ్డి. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్బరామి రెడ్డి మూడున్నర దశాబ్దాలుగా విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయ‌న విశాఖ ఎంపీగా రెండు సార్లు విజయం సాధించారు.

ఇదిలా ఉండగా సుబ్బరామి రెడ్డి రాజ్య‌స‌భ‌ పదవీకాలం వ‌చ్చే మార్చితో ముగియనుంది. ఈ క్ర‌మంలోనే మరికొంతకాలం రాజకీయాలలో యాక్టివ్ గా ఉండాలని ఉండాలని చూస్తున్న క్ర‌మంలోనే ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ నుంచి మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు వెళ్లే అవకావం లేదు. దీంతో గత కొద్ది రోజులుగా సుబ్బరామి రెడ్డి వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకల్లో అందరూ వైసీపీ నేతలే హాజరవ్వడం ఇందుకు బలాన్నిస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ నేతల హంగామా అన్న చర్చ విశాఖ జిల్లాలో తారా స్థాయిలో నడుస్తోంది. మళ్లీ రాజ్యసభకు ఎంపిక కావాలన్న వ్యూహంతో ఉన్న సుబ్బరామి రెడ్డి జగన్ కు దగ్గరవుతున్నట్టు వైసిపి వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక సుబ్బరామి రెడ్డికి విశాఖ జిల్లాలో వ్యక్తిగత ప్రతిష్ట కూడా ఉంది. త్వరలోనే గ్రేటర్ విశాఖ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకున్న సుబ్బరామి రెడ్డి వినూత్నంగా అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here