రేపు తూ.గో.లో సీఎం జగన్ పర్యటన… గ్రామ సచివాలయం ప్రారంభం

0
1545

గాంధీజీ జయంతి రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ కొన్ని కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. సోమవారం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… రేపు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడి కరపలో గ్రామ సచివాలయం ప్రారంభిస్తారు. ఇందుకోసం బుధవారం మధ్యాహ్నం 1 గంటకు… సీఎం జగన్… గుంటూరులోని తాడేపల్లిలో ఉన్న తన ఇంటి నుంచీ బయల్దేరి… తూర్పుగోదావరి జిల్లా… కాకినాడ దగ్గర్లో ఉన్న కరప గ్రామానికి చేరతారు. అక్కడ గ్రామ సచివాలయం పైలాన్ ఆవిష్కరిస్తారు. తర్వాత అక్కడి హైస్కూల్ దగ్గర ఏర్పాటు చేసే స్టాల్స్‌ని అలా అలా చూస్తారు. ఆ తర్వాత అక్కడి బహిరంగ సభలో మాట్లాడతారు.

ప్రభుత్వం గ్రామ సచివాలయం ద్వారా ఏం చేయబోతోందో చెబుతారు. నెక్ట్స్… రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి… వైజాగ్‌లో జరిగే… కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కొడుకు క్రాంతికుమార్ పెళ్లికి వెళ్తారు. అదే రోజు రాత్రి మళ్లీ తాడేపల్లికి వెళ్లిపోతారు. ఇలా ప్రభుత్వం షెడ్యూల్ రెడీ చేసుకుంది. అక్టోబర్ 4న జగన్ వెళ్లబోయే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు పర్యటన కూడా ఫైనలైజ్ అయ్యింది. 4 తర్వాత… 5న ఆయన విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ఇతరత్రా సమర్పిస్తారు. ఇలా నెక్ట్స్ 5 రోజుల వరకూ సీఎం జగన్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు.

గ్రామ సచివాలయం ఎందుకు : గ్రామ స్వరాజ్యం రావాలన్నది బాపూజీ కల. అందులో భాగంగానే ఉర్లోకే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు గ్రామ సచివాలయం అనే వ్యవస్థను తెస్తోంది ఏపీ ప్రభుత్వం. అక్టోబర్ 2న గ్రామ, వార్డు సచివాలయాలు రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ అవుతాయి. ఇందుకు సంబంధించి సీఎం జగన్ సోమవారం… గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అపాయింట్‌మెంట్ లెటర్స్‌ని సోమవారం విజయవాడలో 5000 మందికి ఇచ్చారు. జిల్లాల్లో కూడా నియామక పత్రాల జారీ జరిగింది. మొత్తం 13,065 గ్రామ పంచాయతీలను 11,158 గ్రామ సచివాలయాలు మార్చేస్తున్నారు.

ఇకపై ప్రజల సమస్యలన్నీ గ్రామ, వార్డ్ సచివాలయం ద్వారా పరిష్కారమవుతాయి. ప్రజలు సమస్య చెప్పిన 72 గంటల్లోనే సెటిల్ అవుతాయి. ప్రధానంగా ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు, విద్యార్థులకు అవసరమైన వివిధ సర్టిఫికెట్లు వెంటనే వస్తాయి. గ్రామాల్లో రైతుల సమస్యలు, మురుగునీటి పారుదల, ఆరోగ్యం, మంటి నీటి సరఫరా, కరెంటు సరఫరా వంటి సేవల సమస్యలు చకచకా పరిష్కారం అవుతాయి. పింఛన్లు, రేషన్‌కార్డులు, రుణాల కార్డులను ఇక్కడే ఇస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here