వాల్మీకి రివ్యూ, రేటింగ్

0
1024

చిత్ర కథ
అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన బాల మురళి (అధర్వ) ఎలాగైనా ఓ సూపర్ హిట్ సినిమా తీయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతను ఓ రియల్ గ్యాంగ్ స్టర్ కథను తెరకెక్కించాలని అనుకుంటాడు. అలా అనుకున్న అతనికి గద్దలకొండ గణేష్ తారసపడతాడు. ఇక ఆ దర్శకుడి ఫొకస్ గణేష్ మీద పడుతుంది. తీస్తే ఇతని జీవితాన్నే సినిమాగా చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో గణేష్ కు దగ్గరవుతాడు బాల మురళి. ఇక గణిగా ఉన్న అతను గద్దలకొండ గణేష్ గా ఎలా మారాడు..? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? దర్శకుడి కావాలనుకున్న బాల మురళి గణేష్ ను ఎందుకు ఎంచుకున్నాడు..? దర్శకుడు ఆ సినిమా పూర్తి చేశాడా..? చివరకు గణేష్ ఏమయ్యాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ
గద్దలకొండ గణేష్ అలియాస్ గణి ఈ పాత్రలో వరుణ్ తేజ్ తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. నెగటివ్ రోల్ లో తన మేనరిజం, స్టైల్ అన్ని చాలా పరిణితిగా అనిపిస్తాయి. సినిమాలో వరుణ్ తేజ్ తన నట విశ్వరూపం చూపించాడని అనిపిస్తుంది. డైలాగ్స్, యాక్షన్, కామెడీ ఇలా అన్నిటిలో వరుణ్ తేజ్ అదరగొట్టాడు. సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ చేసిన నటుడు అధర్వ. తనకి ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు అధర్వ. పూజా హెగ్దె చేసింది చిన్న పాత్రే అయినా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఎల్లువొచ్చే గొదారమ్మ సాంగ్ లో పూజా అదరగొట్టేసిందని చెప్పొచ్చు. సినిమాలో మరో హీరోయిన్ మృణాళిని కూడా మెప్పించింది. సత్య కామెడీ బాగుంది. తణికెళ్ల భరణి ఎప్పటిలానే పాత్రకు న్యాయం చేశారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

సాంకేతికవర్గం పనితీరు
అయాంకా బోస్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ప్రతి ఫ్రేం చాలా బాగుంది. గద్దలకొండ గణేష్ కు మిక్కి జే మేయర్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పొచ్చు. సినిమాలోని సాంగ్స్ అన్ని మెప్పించాయి. ఎల్లొవొచ్చి సాంగ్ రీమిక్స్ అలరించింది. బిజిఎం కూడా బాగా ఇచ్చాడు. దర్శకుడు హరీష్ శంకర్ ఇదో రీమేక్ అన్న ఆలోచన ఎక్కడా రాకుండా చేశాడు. కథ మాత్రమే తీసుకుని దానికి తన మార్క్ స్టైల్ ను యాడ్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఖర్చి పెట్టారని తెలుస్తుంది.

చిత్ర విశ్లేషణ
రీమేక్ సినిమాలను తీసే విధానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సినిమా లైన్ ను మాత్రమే తీసుకుని మన ప్రేక్షకుల ఆలోచనలను బట్టి కథనం రాసుకోవడం.. లేదా మక్కీకి మక్కీ దించేయడం. గద్దలకొండ గణేష్ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా తెరకెక్కింది. అయితే సినిమా రీమేక్ చేసిన హరీష్ శంకర్ నెగటివ్ రోల్ చేసిన వరుణ్ తేజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు

సినిమా అంతా వరుణ్ తేజ్ క్యారక్టరైజేషన్.. అతని స్టైల్.. లుక్ వీటిలో తన మార్క్ కనిపించేలా చేశాడు. ఒరిజినల్ లో బాబీ సిం హాని మించేలా వరుణ్ తేజ్ లుక్ ఉందని చెప్పొచ్చు. ఇక హరీష్ శంకర్ మార్క్ కామెడీ కూడా సినిమాలో ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం కాస్త డిస్ట్రబ్ చేస్తాయి.

ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, వరుణ్ తేజ్ పూర్తిస్థాయి మేకోవర్ మెగా ఫ్యాన్స్ కు మాస్ ఆడియెన్స్ కు కిక్ ఇస్తాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ ను ఇలా చూపించినందుకు హరీష్ గట్స్ ను మెచ్చుకోవాల్సిందే. ముకుంద నుండి ఎఫ్2 వరకు అన్ని సాఫ్ట్ పాత్రఏ వేస్తున్న వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ గా అదరగొట్టేలా చేశాడు హరీష్ శంకర్.

మంచి
వరుణ్ తేజ్
సినిమాటోగ్రఫీ
మ్యూజిక్

చెడు
అక్కడక్కడ స్లో అవడం
ప్రీ క్లైమాస్ సెంటిమెంట్

★★★★★ – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here