వైఎస్ షర్మిలకు కీలక పదవి..!!?

0
893

వైఎస్ జగన్ సోదరిగానే కాకుండా పార్టీ కోసం గతంలో అనేకమార్లు ప్రజల్లోకి వచ్చి పనిచేసింది. జగన్ జైలులో ఉండగా పాదయాత్ర చేసింది. అన్న జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం చెల్లెలు షర్మిల పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్ ను జైలుకు పంపించారు. ఆ సమయంలో వైఎస్ షర్మిల పార్టీ బాధ్యతను తీసుకొని సమర్ధవంతంగా నడిపించారు. కాంగ్రెస్ పార్టీపై ఆమె విమర్శల వర్షం కురిపించారు.

రాత్రి పగలు తేడా లేకుండా పాదయాత్రలు చేస్తూ… ముందుకు సాగారు.మీ కోసం జగనన్న వస్తున్నాడు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందంటూ ప్రసంగిస్తూ ప్రతి నియోజకవర్గంలో పంచ్ డైలాగులతో జనాలనుఅప్పట్లో ఆకట్టుకున్నారు షర్మిల. 2014లో టిడిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆమె అన్నతో కలిసి పాదయాత్ర, ప్రజల్లో ప్రసంగాలు చేసింది. అవి ప్రజలకు బాగా ఆకట్టుకున్నాయి. దీని ఫలితమే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం. జగన్ ముఖ్యమంత్రి కావడం.బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చిందని ఆమె చేసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని లోకేష్ కు బాబు మూడు శాఖలు కట్టబెట్టారని ఆమె విమర్శించిన సంగతి తెలిసిందే. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే పాదయాత్ర చేసి తన ఉనికిని చాటుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చారో.. అదే తరహాలో జగన్ ను జైలులో పెట్టిన తరువాత షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఆ పాదయాత్ర వైకాపాకు బాగా కలిసి వచ్చింది. బాబు, లోకేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎవరిని వదలకుండా విమర్శలు చేసింది. ఇలా ఆమె ప్రజలకు చేరువయ్యారు.జగన్ జైలుకెళ్లినా వైసీపీ పార్టీకి పెద్ద దిక్కుగా షర్మిల ముందుకు సాగారు. ఎన్నికల ముందు, తర్వాత ఓ వైపు తల్లి విజయలక్ష్మి, మరోవైపు సోదరి షర్మిల విస్త్రత ప్రచారంతో జనంలోకి వెళ్లిపోయారు.

2019 ఎన్నికల సమయంలో కూడా షర్మిల జగన్ తరపున ప్రచారం నిర్వహించింది. పార్టీని గెలిపించాలని కోరింది. ప్రజలు జగన్ ను గెలిపించారు. వైకాపా గెలిచిన తరువాత షర్మిలకు కేబినెట్ లో పదవి వస్తుందని అందరు అనుకున్నారు. కానీ, తనకు ఏ పదవి అవసరం లేదని ఇప్పటికే పలుమార్లు చెప్పింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, త్వరలోనే ఆమెకు పార్టీలో ఓ కీలక పదవిని అప్పగించబోతున్నారని వార్తలు అందుతున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం త్వరలోనే తేలిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here