వైసిపి లో ఎంపీ అభ్యర్ధులు ఖరారయ్యారా. అధికారికంగా ప్రకటించకపోయినా అభ్య ర్ధు లెవరో జగన్ డిసైడ్ అయ్యారా. లో క్‌సభకు మందుస్తు ఎన్నికలు ఖాయమనే వార్తల నేపథ్యంలో జగన్ ముందస్తుగానే అభ్యర్ధుల ఎంపిక పై దృష్టి పెట్టారు. దీని కోసం ప్రతీ నియోజకవర్గం లో ఆశావాహుల గురించి సర్వేలు చేయిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం పార్టీ అభ్యర్ధులు ఎవరిని ఖరారు చేస్తే పార్టీ గెలుస్తుందనే అంశాల పై విభిన్న కోణాల్లో సర్వే చేయించినట్లు విశ్వసనీయ సమాచారం.
లోక్‌సభ స్థానాల్లో సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలు 2014 ఎన్నికల్లో పోలింగ్ సరళి ఆశావాహులు ఎవరెవరు పోటీ లో ఉన్నారు, ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధులు బలా బలాల పై ప్రాధమిక సమాచారం పై కసరత్తు చేస్తున్నారు. దాదాపు ఇప్పటికే 13 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో సేకరించినట్లు తెలుస్తోంది. జగన్ సైతం లోక్ సభ ఎన్నికలు ముందుగానే జరిగే అవకాశం ఉంని అభ్యర్ధులను సైతం సాధ్యమైనంత త్వరగా ప్రకటించి వారికి బాధ్యత లు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు పార్టీ ఫిరాయించారు. మిగిలిన అయి దుగురు ఏపికి ప్రత్యేక హోదా కోసి ఎంపీ పదవులకు రాజీనామా చేసారు. దీంతో తిరిగి టిక్కెట్లు వీరికి ఖాయంగా కనిపి స్తోంది. ఇక, ఈ సారి ప్రధానంగా సామాజిక సమీకరణాలకు పక్కా ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగానే కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో లోక్‌సభ స్థానం ఖచ్చితంగా బిసిలకు ఇస్తానని జగన్ ప్రకటించారు. అదే విధంగా రాజమండ్రి లోక్‌సభ సైతం బిసిలకు ఇవ్వనున్నారు. ఇక, గుంటూరు, ఏలూరు, బాపట్ల, మచిలీపట్నం వంటి స్థానాలకు ఇప్పటికే సమన్వయకర్తలుగా ఉన్న నేతలు బాధ్యతలు తీసుకున్నారు.
నంద్యాల లో శిల్పా కుటుంబం నుండి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. కర్నూలు బిసి నేతకు ఇవ్వనున్నారు. ఇక, అరకు నుండి గిరిజ న నేతగా ప్రస్తుతం అదే సెగ్మెంట్‌లో అసెంబ్లీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న ఓ నేతకు ఇస్తారని ప్రచారం. శ్రీకాకుళం నుండి ఇద్దరు మహిళా నేతల మధ్య పోటీ ఉంది. కాకినాడ స్థానానికి స్థానిక కీలకమైన టిడిపి నేత వైసిపి లోకి చేరుతారని ఆయన అక్కడ నుండి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. కీలకమైన విశాఖ నుండి ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. అయితే, విశాఖలో అంచనా వేస్తున్నట్లుగా స్థానికంగా పేరున్న ఏ ప్రముఖ వ్యాపారవేత్త జాతీయ పార్టీ నేతగా ఉన్న వ్యక్తి వైసిపి లో చేరటం ఖాయమైతే ఆయనకు టిక్కెట్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక, ఏపి రాజధాని గా ఉన్న కీలకమైన విజయవాడ లోక్‌సభ స్థానాన్ని ఈ సారి గెలిచి టిడిపికి చెక్ పెట్టాలని వైసిపి యోచిస్తోంది. ఇందు కోసం ఇప్పటి వరకు అక్కడ ఎవరికీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించలేదు. అయితే, ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త లేదా ఓ నిర్మాత పేర్లు అక్కడ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్నాయి. ఇలా పోటీలో ఉన్న వీరందరి గెలుపు అవకాశాల పై జగన్ లోతుగా సర్వేలు చేయిస్తున్నారు. ఆ తరువాత వీరి పేర్ల ఖరారు పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, జగన్ సోదరి షర్మిళ సైతం ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో షర్మిళ పోటీకి దిగితే నర్సరావు పేట లేదా ఒంగోలు నుండి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.