సందీప్ రెడ్డి వంగా ఏ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడో తెలుసా..?

0
1261

అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమానే హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడా సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు.అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమానే హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడా సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈయన కోసం తెలుగు హీరోలు బాగానే వేచి చూస్తున్నారు. ఏదేమైనా కూడా 2017 నుంచి కూడా అర్జున్ రెడ్డితోనే ట్రావెల్ అవుతున్నాడు ఈ దర్శకుడు. తెలుగులో రెండో సినిమా చేస్తాడేమో అనుకుంటే.. ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ అయిపోయింది.

రెండో సినిమా చేయాల్సిన సమయం వచ్చేసింది. ఇదివరకు తెలుగులో సినిమాలు చేయాలనుకున్న సందీప్.. ఇప్పుడు మాత్రం హిందీపై ఫోకస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌ను తన కథతో మెప్పించాడని తెలుస్తుంది. ఈ ఇద్దరి మధ్య సింగిల్ సిట్టింగ్‌లోనే కథ ఓకే అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ క్రైమ్ డ్రామాను రాసుకుంటున్నాడు సందీప్. అసలు క్రైమ్ ఎలా ఉండబోతుందో చూపిస్తానంటూ ఆ మధ్య ఛాలెంజ్ చేసాడు సందీప్.

ఇప్పుడు అది చేసి చూపించే పనిలో బిజీగా ఉన్నాడు. సంజయ్ దత్ బయోపిక్ తర్వాత ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు రణ్‌బీర్ కపూర్. ఇలాంటి సమయంలో సందీప్ రెడ్డి వంగా లాంటి సంచలన దర్శకుడితో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు పెరుగుతాయి. ఈ సినిమాను T సీరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. దీనికి కారణం ప్రస్తుతం రణబీర్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. బ్రహ్మస్త్రతో పాటు మరో భారీ సినిమాలోనూ నటిస్తున్నాడు రణ్‌బీర్. మొత్తానికి ఈ క్రైమ్ డ్రామాతో సందీప్ బాలీవుడ్‌లోనే తన ప్లేస్ సుస్థిరం చేసుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here