స్వరాజ్యాన్ని సురాజ్యం చేసుకోవడమే తిలక్‌కు నివాళి.. గణేశ్ ఉత్సవాల్లో నమో

0
1162

ముంబై : స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ .. స్వరాజ్యం నా జన్మహక్కు అని నినాదించారు. తెల్ల దొరలను గడ గడ వణికించాడు. ప్రతీ ఏటా లోక్‌మాన్య సేవా సంఘ్ ముంబై శివారు విలే పార్లేలో గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సారి ప్రధాని మోడీ హాజయ్యారు. బెంగళూరులోని ఇస్రో నుంచి నేరుగా ముంబై చేరుకున్నారు. ముంబైలో మూడు మెట్రో ట్రైన్, వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు.

విలే పార్లేలో తిలక్ స్మారకర్థం 1923 నుంచి గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అక్కడ తిలక్ విగ్రహాం కూడా ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనుల కోసం మహారాష్ట్ర విచ్చేసిన ప్రధాని మోడీ .. విలే పార్లేలో గల గణేశ్ ఉత్సవాల్లో కూడా పాల్గొన్నారు. తర్వాత అక్కడ గల విజిటర్స్ బుక్స్‌లో ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని మోడీ రాయడం చర్చానీయాంశమైంది. ఆయన ఏం రాశారో మోడీ మాటల్లోనే..

‘మీ జీవితానికి తిలక్ మాటలు వేదమంత్రాలు కావాలి, మీరంతా అతని భావాలను ఆదర్శంగా తీసుకోవాలి, స్వరాజ్యం నా జన్మహక్కు అని తిలక్ అన్నారు. కానీ నేడు దేశంలో మన మంత్ర సురాజ్యం మన విధి అవుతుంది. ఇదీ ప్రస్తుత పరిస్థితుల్లో మనందరీ మనసు గెలుచుకుంటుంది. మిగతవారికి ఆదర్శంగా కూడా నిలుస్తోంది. స్వరాజ్యం వచ్చింది గనుక దానిని సురాజ్యం చేసుకోవడమే మన విధి అని’ అర్థమయ్యేలా నోట్ రాశారు మోడీ. ముంబైలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని మోడీతో మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్ర్యారీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎల్ఎస్ఎస్ అధ్యక్షుడు ముకుంద్ చితాలే, కమిటీ సభ్యులు రష్మీ ఫడ్నవీస్, మహేశ్ కాలే, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here