హెల్త్ అలర్ట్: హైదరాబాదును వణికిస్తున్న డెంగ్యూ…కొత్తగా మరో వైరస్

    0
    1488

    వాతావరణంలో మార్పులు, వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాదులో విషజ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో దోమలు అక్కడికి చేరుతున్నాయి. ఇక దోమకాటుకు గురై చాలామంది డెంగ్యూతో బాధపడుతున్నారు. డెంగ్యూ జ్వరాలు ప్రధానంగా నాలుగు వైరస్‌ల నుంచి సోకుతుంది. అవి డెన్-1, డెన్-2, డెన్-3, డెన్-4. ఈ నాలుగు వైరస్‌లను సెరోటైప్‌లుగా పిలుస్తారు. మనిషి రక్తంలోని సీరంలో ఒక్కో వైరస్ ఒక్కోలా ప్రవర్తిస్తుంది.

    ఇక ఈ నాలుగు రకాల వైరస్‌లు కలిగిన డెంగ్యూ కేసులు హైదరాబాదులోనే గుర్తించడం జరిగింది. సూక్ష్మస్థాయిలో డెంగ్యూ కేసులను పరిశీలించాలని ఏ ఒక్కరిని విస్మరించకూడది నగరంలోని డాక్టర్లు పిలుపునిస్తున్నారు. నాలుగు రకాల వైరస్‌లు కలిగి ఉన్న డెంగ్యూ జ్వరాలు హైదరాబాదులో ప్రబలుతున్న నేపథ్యంలో డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గత మూడేళ్లలో సీరం టైప్ కొత్త డెంగ్యూ వైరస్‌లు వెలుగుచూడటంతో ఈ భయం మరింత ఎక్కువైంది.

    ప్రైమరీ ఇన్‌ఫెక్షన్స్‌లోనే ఎక్కువ సమస్య ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక డెంగ్యూ వేరియంట్-2లో నాలుగు రకాల వైరస్‌లు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. హైదరాబాదులో గుర్తించిన డెంగ్యూ కేసులు అత్యంత ప్రమాదకరమైనవిగా వారు చెబుతున్నారు. దీనికి తోడు డెంగ్యూతో పాటు చికన్ గున్యా, టైఫాయిడ్‌లు కూడా వస్తున్నట్లు గాంధీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. గత మూడేళ్ల పరిశోధనల్లో కొత్త వైరస్‌ను కనుగొన్నారు. దాన్నే డెంగ్యూ వైరస్‌ క్లాడ్ 4గా పిలుస్తున్నారు. నాలుగు వైరస్‌లు కలిపిన డెంగ్యూ జ్వరం వస్తే పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

    ఒక్కసారి ఒక వేరియంట్‌కు సంబంధించిన డెంగ్యూ వ్యాధి వస్తే మిగతా వేరియంట్‌లు కూడా మనిషికి వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అంటువ్యాధులు ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ సమయంలోనే పలు రకాల వైరస్‌లు మనిషికి సోకుతాయని హెచ్చరిస్తున్నారు

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here