ఇది చంద్రయాన్ -2 పూర్తి కధ….

0
1033

మనుషులని ఇతర జీవరాసులని వెరి చేసె ముఖ్య లక్షణం‌ అలోచించడం,అన్వేషించడం. అన్వేషణ అంటే చాలా ఇష్టం ఎందుకంటే దాని వల్లే మనకి చాలా కొత్త విషయాలు తెలిశాయి. 1950-60 వరకు మనుషు లు కేవలం భూమిని మాత్రమే అన్వేషించారు. ఆ తర్వాత స్పేస్ ను కూడా అన్వేషించాలనే చేయాలనే ఆలోచన మనుషుల్లో మొదలయ్యింది ఆలోచన వచ్చిన వెంటనే మొదటిగా స్పేస్ లోకి ఒక శాటిలైట్ ని పంపారు ఆ తర్వాత కొన్ని జంతువుల్ని పంపారు, మెల్లగా మనుషుల్ని కూడా పంపారు. అప్పట్లో‌ అగ్ర రాజ్యాలుగా ఉన్న అమెరికా రష్యా మాత్రమే స్పేస్ మీద రీసర్చ్ చేశాయి. ఇవి చూశాక భారత ప్రభుత్వానికి కూడా ఒక ఆలోచన వచ్చింది దేశం లో కూడా స్పేస్ నాలెడ్జ్ ఉన్న సైంటిస్టులు చాలామంది ఉన్నారు వాళ్ళని ప్రోత్సహిద్దామని అనుకుంది అయితే అప్పట్లో అమెరికా రష్యా దేశాలు కేవలం తమ సత్తాని చూపించుకోవటానికి మాత్రమే స్పేస్ ని అన్వేషించాయి. కానీ భారతదేశం దేశం అప్పటి పరిస్తితి సరిగా లేదని, ప్రజలందరి ఆకలిని తీర్చగలిగే విధంగా దేశం యొక్క పరిస్థితి ఉన్నప్పుడు ఈ విషయాల మీద ఆలోచిద్దామని అప్పటి ప్రభుత్వం అనుకుంది.

కొన్నేళ్ళ తరువాత దేశ అవసరాల కోసం స్పేస్ రీసెర్చ్ ఉపయోగపడేలా ఉండాలని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అనే సంస్థ ని భారత ప్రభుత్వం స్థాపించింది. ఈ సంస్థ ఆలోచన అతి తక్కువ ఖర్చు తో స్పేస్ ని అన్వేషించగలిగే టెక్నాలజీ ని అభివృద్ది చేయడం. ఆ టెక్నాలజీ సామాన్య ప్రజలు కూడా ఉపయోగపడేలా చేయడం వల్ల ఇస్రో బాగా సక్సెస్ అయింది. ఒక మార్స్ ఆర్బిటర్ ని పంపడానికి నాసా కి అయిదు వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది కానీ ఇస్రో కేవలం ఐదు వందల కోట్ల రూపాయ లతో ప్రాజెక్టు పూర్తి చేసింది. ఇస్రో బడ్జెట్ నాసా బడ్జెట్ లో కేవలం‌ పది శాతం. ప్రపంచం లో కేవలం ఇస్రో మాత్రమే అతి తక్కువ ఖర్చు తో శాటిలైట్స్ ని స్పేస్ లోకి పంపుతోంది అందుకే ఇతర దేశాలు శాటిలైట్ లాంచింగ్ విషయం లో ఇస్రో దగ్గరి కి వస్తాయి. ముఖ్య విషయం ఏంటంటే వేరే దేశాల మీద ఆధార పడకుండా ఇస్రో ప్రతి ఒక్క టెక్నాలజీ ని తన సొంతంగా తయారు చేసుకుంది .

ఇన్ని రోజులు స్పేస్ ని మాత్రమే ఇస్రో అన్వేషించింది. ఇక నుంచి వేరే గ్రహాల ను కూడా అన్వేషణ చెయ్యాలనుకుంది అప్పుడు వారికి అతి దెగ్గరగా ఉన్న గ్రహం/ఉపగ్రహం చంద్రుడు. చూడటానికి ఆకారం లో గానీ భూఆకర్షణ లోగానీ చంద్రుడు భూమిని పోలి ఉంటుంది. అందుకని ఇస్రో మొదటిగా చంద్రుణ్ణి అన్వేషించాలనుకుంది 2008లో చంద్రయాన్-1 అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ ని మొదలు పెట్టింది ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యాం చంద్రుడి చుట్టూ ఒక ఆర్బిటర్ ను తిరిగేలా చెయ్యడం దానితో చంద్రుడి ఉపరితలం ని స్కాన్ చేసి అక్కడ మనవ జాతి మనుగడకి కావల్సిన ఇనుము, క్యాల్షియం, యురేనియం వంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం, దానితో పాటు ఒక వెహికల్ ని చంద్రుడి ఉపరితలం మీద పడేలా చేయటం. దాని పేరు మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. ఇస్రో కేవలం దానిని ఆర్బిటర్ లో మాత్రమే పెట్టాలనుకుంది కానీ అప్పుడు అబ్దుల్ కలాం గారు భారత దేశ జండా చంద్రుడు మీద ఉండేలా చేయాలని కోరారు. అందుకే ఇస్రో మున్ ఇంపాక్ట్ ప్రోబ్ ని కూడా జత చేసి దాని మీద ఇండియన్ ఫ్లాగ్ ఇండియన్ ఎంబ్లెమ్ ని ప్రింట్ చేసి చంద్రుడి మీద దిగేలా చేసింది.

చంద్రయాన్-1 ప్రాజెక్టులో ఉన్న లక్షాలన్నిటిని ఇస్రో పూర్తి చేసింది. ఈ ప్రక్రియ లోనే ఇస్రో కి ఒక కొత్త విషయం తెలిసింది అదేంటంటే చంద్రుడి మీద ఐస్ రూపంలో నీరు ఉందని అప్పటి వరకు ఇతర దేశాలకు చెందిన సైంటిస్టులకి చంద్రుడి మీద నీరు ఉన్నయేమోనని ఊహ మాత్రమే, కానీ అది నిజమై ఇస్రో నిరూపించింది. చంద్రుడి చుట్టూ మూడు వందల పన్నెండు రోజులు తిరిగిన ఆ ఆర్బిటర్ చివరకి కొన్ని కారణాల వల్ల కూలిపోయింది. ఈ ఆర్బిటర్ రెండు సంవత్సరాల పని చేయాలి కానీ సూర్య కిరణాలు దాని మీద ఎక్కువగా పడటం వల్ల వేడి పెరిగి ఆ ఆర్బిటర్ పని చేయడం మానేసింది. ఇస్రో తో కాంటాక్ట్ కట్టింది ఇప్పటికీ ఆ చంద్రయాన్-1 ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ అలా తిరుగుతూనే ఉంది, అది కొన్ని సంవత్సరాల తరువాత ఆర్బిటర్ చంద్రుడి మీది పడిపోతుంది. చంద్రయాన్-1 లో కేవలం ఒక వెహికిల్ ని మాత్రమే చంద్రుడి మీద పడేలా చేశారు తరువాత ప్రయోగంలో వెహికల్ ని సాఫ్ట్ గా ల్యాండ్ చేసి కొన్ని రోజులు చంద్రుడి ఉపరితలం మీద నడిచేలా చెయ్యాలనుకున్నారు. అప్పటికే చంద్రయాన్-1 కావలసిన సమాచారాన్ని ఇస్రో కి దాదాపుగ 70000 ఫొటోల రూపం లో ఇస్రో కి పంపింది.

ఈ సారి ప్రాజెక్ట్ కి చంద్రయాన్-2 అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టు లక్షాలు ఒక వెహికల్ ని చంద్రుడు మీద ల్యాండ్ చేసి కొన్ని రోజులు దాని మీద తిరిగి అక్కడ పరిశీలించిన సమాచారాన్ని ఇస్రో కి పంపించటం. చంద్రుడి మీద ఉన్న మట్టి లోపల నీరు ఉందో లేదో కనిపెట్టగలిగితే దాని ద్వారా అసలు అక్కడ మనుషులు నివసించగలరా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనిషి జీవించాలంటే నీరు చాలా ముఖ్యం. ఇప్పటి వరకు చంద్రుడి మీద సాఫ్ట్ లెండింగ్ కేవలం మూడు దేశాలు మాత్రమే చేయగలిగాయి అవి అమెరికా, రష్యా, చైనా, ఇప్పుడు భారతదేశం ఆ ఘనత సాదించిన నాల్గవ దేశం అవుతుంది. కాని వీటిలో‌ భారతదేశం గొప్పతనం ఎమిటంటే ఇప్పటి వరకు చంద్రుడి మీద ఏ దేశాలు కనీసం చూడని చోట చంద్రయాన్-2 ల్యాండ్ అవ్వబోతోంది .

చంద్రయాన్ -2 అంతరిక్ష నౌకను ప్రయోగించడానికి ఎంపిక చేసిన జిఎస్ఎల్వి మార్క్3 ఇస్రో సొంతంగా అభివృద్ధి చేసిన హెవీ లిఫ్ట్ ప్రయోగ వాహనం. జిఎస్ఎల్వి మార్క్3 4 టన్నుల ఉపగ్రహాలను జియోసిన్క్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (GTO) లోకి లేదా 10 టన్నుల బరువును లో ఎర్త్ ఆర్బిట్ (LEO) కు తీసుకువెళ్ళడానికి రూపొందించబడింది, ఇది జిఎస్ఎల్వి మార్క్2 కన్నా ఇది రెట్టింపు సామర్ధ్యం. జిఎస్ఎల్వి మార్క్3 యొక్క రెండు స్ట్రాప్-ఆన్ మోటార్లు దాని ప్రైమరీ లిక్విడ్ బూస్టర్‌కు ఇరువైపులా ఉన్నాయి. ‘ఎస్ 200’ గా పేరున్న ఇవి 205 టన్నుల సాలి ప్రొపెల్లెంట్, దానిని మందించడం‌ ద్వారా వాహనాన్ని గాలిలోకి పంపుతుంది. S200 లు 140 సెకన్ల పాటు పనిచేస్తాయి. స్ట్రాప్-ఆన్స్ పనితీరు దశలో, L110 లిక్విడ్ కోర్ బూస్టర్, రెండు క్లస్టర్డ్ లిక్విడ్ ఇంజన్లు వాహనం యొక్క థ్రస్ట్‌ను మరింత పెంచడానికి లిఫ్ట్-ఆఫ్ చేయడానికి తరువాత 114 సెకన్లు పాటు పనిచేస్తాయి. లిఫ్ట్ -ఆఫ్ తర్వాత 140 సెకన్ల వద్ద స్త్రాప్-ఆన్‌లను వేరు చేసిన తర్వాత ఈ రెండు ఇంజన్లు పనిచేస్తూనే ఉంటాయి. ఈ మాడ్యూల్ తో కాసేపు భూమి చుట్టూ తిరుగుతుంది తరువాత థ్రస్టర్ సహాయం తో మెల్ల గా స్పీడ్ పెంచుకుంటూ మోడ్యూల్ అనేది చంద్రుడి కక్ష లోకి ప్రవేశిస్తుంది.

ఈ మాడ్యూల్ లో మూడు ముఖ్య భాగాలు ఉంతాయి అవి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ఈ ల్యాండర్ లోపల రోవర్ ఉంటుంది, మాడ్యూల్ అనేది చంద్రుడి కక్షలోకి రాగానే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరవుతుంది. ఆర్బిటర్ మాత్రం 100 కిలోమీటర్ల ఎత్తులో చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ల్యాండర్ మాత్రం వేగాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది. దాని వల్ల చంద్రుడి ఉపరితలానికి దగ్గర గా వస్తుంది. అలా మెల్లగా ల్యాండర్ అనేది చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది. ఈ ల్యాండర్ పేరు విక్రమ్, ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ పేరుని ఈ ల్యాండర్ కి పెట్టారు. ల్యాందర్ దిగిన వెంటనే రోవర్ బయటికి వస్తుంది ఈ రోవర్ పేరు ప్రగ్యాన్. ఈ రోవర్ చంద్రుడు మీద తిరిగి అక్కడి మట్టి నమూనాలని తీసుకొ ని వాటి మీద ప్రయోగం చేసి డేటాని ఆర్బిటర్ కి పంపుతుంది ఈ ఆర్బిటర్ తిరిగి డేటాని భూమికి పంపుతుంది.
రోవర్ లోపల ఉన్న ఎక్విప్మెంట్ సహయంతో చంద్రుడి మట్టి లోపల అసలు నీరు ఉందా లేదా అని తెలుసుకుంటుంది. కానీ ఈ రోవర్ కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే చంద్రుడు మీద తిరుగ గలుగుతుంది తరవాత అది పనిచేయదు. అది పనిచేయాలంటే సూర్య కిరణాలు కావాలి, చంద్రుడి మీద పద్నాలుగు రోజులు నూర్య రశ్మి ఉంటుంది, తరువాత పద్నాలుగు రోజులు చీకటి ఉంటుంది, నూర్య రశ్మి లేకపోతే రోవర్ బ్యాటరీస్ రీచార్జ్ అవ్వలేవు అందువల్ల రోవర్ పనిచేయదు. ఆర్బిటర్ మాత్రం ఒక సంవత్సరం పాటు పనిచేస్తుంది అప్పటి వరకు అది చంద్రుడిసి సంభందించిన ఫొటోలని భూమికి పంపిస్తుంది. రాకెట్ లాంచింగ్ రోజు నుండి చంద్రుడి మీద రోవర్ దిగడానికి మొత్తం 50 రోజులు పడుతుంది. మొదటగా జులై 15 రాత్రి 2:30 రాకెట్ ని లాంచ్ చేయాలి కానీ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల దానిని ఆపేశారు.

చంద్రయాన్-1 అప్పుడు కూడా లాంచింగ్ డే రోజు ఇలానే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అయితే అప్పుడు ప్రాబ్లంని వెంటనే సరిచేసి వెంటనే రాకెట్ ను లాంచ్ చేశారు. కానీ ఈ సారి సరిచేయడానికి దాదాపు వారం రోజులు పట్టింది,దానిని 22 జులై నాడు లాంచ్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ ని 2008 లోనే రష్యా దేశం తో మొదలు పెట్టారు. భారత దేశం రాకెట్ ని రోవర్ ని తయారు చేయాలి రష్యా ల్యాండర్ ను తయారు చెయ్యాలి, 2012 రాకెట్ ని లాంచ్ చేయాలి అని ఇరు దేశా ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాని రష్యా ఇచ్చిన గడువులో ల్యాండర్ ను తయారు చేయలేకపోయింది అప్పుడు ఇండియానే సొంతగా ల్యాండర్ ను కూడా తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల చంద్రయాన్ -2 ఇంత ఆలస్యం అయ్యింది .

భారత కాలమానం‌ ప్రకారం సెప్టెంబర్ 7 తెల్లవారుఝామున 1:30 మరియు 2:30 మధ్య అది చంద్రుడి మీదకు చేరుకుంటుంది. ల్యాండింగ్ అయిన వెంటనే రోంప్‌ను ఉపయోగించి రోవర్ చంద్రుడి మీదకు దిగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here