చంద్రబాబుకు మరో ఘోర పరాభవం తప్పదా..!

0
1094

చంద్రబాబు హుజూర్ నగర్ ఉపఎన్నిక పోరులో టీడీపీ తరుపున అభ్యర్ధిని నిలిపి మరో ఘోర ప్రభావానికి సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ టీడీపీలో పట్టుమని పదిమంది నాయకులు కూడా లేరు. 2014 తర్వాత చాలామంది టీఆర్ఎస్ లో చేరిపోతే, కొందరు కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక ఆ పార్టీ కేడర్ గానీ, ఓటు బ్యాంక్ గానీ ఎక్కువ శాతం టీఆర్ఎస్ వైపు వెళ్లిపోయింది.

దీంతో తెలంగాణలో అడ్రెస్ లేకుండా పోయింది. ఈ తరుణంలోనే 2018 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో చరిత్రలో బద్ద శత్రువైన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. పొత్తులో భాగంగా 13 సీట్లలో పోటీ చేసి 2 స్థానాల్లో గెలిచి ఘోర పరాభవం పొందింది. ఆఖరికి నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ తనయ సుహాసిని కూడా కూకట్ పల్లి బరిలో నిలిచి ఓటమి పాలైంది. అప్పుడు కేవలం చంద్రబాబు చేసిన రాజకీయాలకే ఆమె బలైపోయిందని ప్రచారం కూడా జరిగింది.

ఈ దెబ్బతో సైలెంట్ అయిపోయిన చంద్రబాబు మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దిగలేదు. ఈ సమయంలోనే ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో అటు ఏపీలో, ఇటు తెలంగాణలోని నేతలు తమ దారి తాము చూసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అక్కడక్కడ మిగిలిన నేతలు బీజేపీలోకి జంప్ అయిపోయారు. అయితే ఇన్ని పరాభవాలు ఎదురైన చంద్రబాబు వెనక్కి తగ్గకుండా మరో పరాభవానికి సిద్ధమయ్యారు. హుజూర్ నగర్ బరిలో టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దించారు.

అసలు గెలవరని తెలిసి కూడా చంద్రబాబు ఎందుకు పోటీకి దింపారని రాజకీయ విశ్లేషుకులు షాక్ అవుతున్నారు. అసలు ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఆరు నూరైన టీడీపీ గెలిచే ప్రసక్తి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని ఎందుకు బరిలోకి దించారో ఎవరికి అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా చంద్రబాబు మరో ఘోర పరాభవానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here