జగన్ భగీరథ యత్నం కృష్ణా పై 3 బ్యారేజీలు

0
1076
గ్రామ సచివాలయాల ప్రారంభానికి ముహూర్తం కుదిరింది....!!

కాళేశ్వరం మూడు ప్రాజెక్టులు కట్టి తెలంగాణ తాగు సాగు నీటి అవసరాలు తీరుస్తున్న కేసీఆర్ బాటలోనే నడిచేందుకు జగన్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం భారీ వరదలతో పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజీ కిందకు వందల టీఎంసీల నీరు వృథాగా పోయాయి.. పైగా సముద్రంలోని నీరు కూడా గోదావరిలోకి వచ్చి ఆ నీటితో డెల్టాలోని భూమి చౌడుబారుతోంది. వీటన్నింటిని చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్ భగీరథ యత్నానికి పూనుకుంటున్నారు.

ప్రస్తుతం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ చివరన ఏ ప్రాజెక్ట్ లేదు. దీంతో కృష్ణా నీరంతా సముద్రంలో కలుస్తోంది. అది రైతులకు ప్రజల తాగునీటికి ఉపయోగపడకుండా పోతోంది. అందుకే ఇప్పుడు పులిచింతల నుంచి సముద్రంలో కలిసే వరకూ కొత్తగా మూడు బ్యారేజీలు నిర్మించాలని జగన్ ఆదేశించారు.ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు డీపీఆర్ కోసం 8.78 కోట్లను కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్ కు జగన్ సర్కారు విడుదల చేసింది.

ప్రస్తుతం కృష్ణా నదిపై చోడవరం – గాజులలంక – ఓలేరు వద్ద మూడు బ్యారేజీల నిర్మాణం కోసం జగన్ సర్కారు డీపీఆర్ సిద్ధం చేస్తోంది. దీనివల్ల కృష్ణా గుంటూరు జిల్లాల్లో సాగు – తాగునీటి అవసరాలను తీర్చవచ్చని జగన్ సర్కారు యోచిస్తోంది. అంతేకాకుండా వరద వస్తే కింది జిల్లాలకు వరద నీటిని తరలించి సస్యశ్యామలం చేయాలని భావిస్తోంది. ఇక బ్యారేజీల వల్ల సముద్ర పు నీరు కృష్ణా నదిలోకి ఎగదన్నదని.. దానివల్ల కృష్ణ డెల్టా భూములు చౌడు భూములుగా మారకుండా రక్షించవచ్చని జగన్ ఈ మూడు బ్యారేజీల నిర్మాణానికి పూనుకున్నారు. బ్యారేజీల నిర్మాణంతో కృష్ణ గుంటూరు జిల్లాలో భూగర్భజలాలు భారీగా పెరుగుతాయని.. రైతులు లాభపడుతారని జగన్ ఈ భగీరథ ప్రయత్నానికి నడుం బిగించారు. పర్యాటక – జలరవాణాకు కూడా ఈ బ్యారేజీలతో సాధ్యం అవుతుందని ప్రణాళికలు రచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here