ప్రైవేట్ మద్యం బంద్.. ఇక సర్కారీ మందు

0
1062
ప్రైవేట్ మద్యం బంద్.. ఇక సర్కారీ మందు

అప్పుడెప్పుడు 1995వ సంవత్సరంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో మద్యనిషేధం అమలు చేసినప్పుడు ఈ మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. ప్రైవేటు వారి చేతుల్లో ఉన్న వైన్ షాపులు మొత్తంగా బంద్ అయిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు వైఎస్ జగన్ సర్కారు వేస్తున్న మద్యపాన నిషేధం అడుగుల్లో భాగంగా ప్రైవేటు మద్యం షాపులు బంద్ అయ్యాయి. దశాబ్ధాల తర్వాత ఏపీలో ప్రైవేటు వైన్స్ ఈరోజుతో బంద్ అయిపోయి నేటి నుంచి సర్కారు మందు లభ్యం అవుతోంది..

సెప్టెంబర్ 30 అంటే నేటితో ప్రైవేట్ వైన్స్ అన్నీ బంద్ అయిపోతున్నారు. రేపటి నుంచి అక్టోబర్ 1 నుంచి సర్కారీ వైన్స్ ఏపీలో మొదలు కాబోతున్నాయి. మద్యం అమ్మకాల్లోనూ సమూల మార్పులు రానున్నాయి ఇప్పటికే ప్రైవేటు వైన్స్ వ్యాపారులు సరుకునంతా ఖాళీ చేస్తున్నారు. ఇక సర్కారీ వైన్స్ దుకాణాల్లో మద్యాన్ని నింపి సిబ్బందిని నియమించే పనులను ఎక్సైజ్ శాఖ వేగంగా చేపడుతోంది.

ప్రస్తుతం ఏపీలో 4800 ప్రైవేటు మద్యం షాపులు వ్యాపారుల చేతుల్లో ఉండగా.. ఇప్పుడు జగన్ సర్కారు మద్యనిషేధం దశలవారీగా అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ సంఖ్యను ఇప్పుడు 20శాతం తగ్గించి 3448 ప్రభుత్వ మద్యం దుకాణాలకు పరిమితం చేస్తోంది. ఇప్పుడు అక్టోబర్ 1న 3200 వరకూ కొత్త సర్కారీ మద్యం షాపులు ప్రారంభం కాబోతున్నాయి.

అయితే కొత్త సర్కారీ వైన్స్ షాపుల్లో బీర్లు పెట్టడానికి ఫ్రిజ్ లు కొనుగోలు చేయలేదు. ఆర్థిక భారం కారణంగా వదిలేశారు. దీంతో చిల్ బీర్ లేని అమ్మకాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బీర్ ను ఇంటికి తీసుకెళ్లి కూలింగ్ పెట్టుకొని తాగే పరిస్థితి లేకపోవడంతో బీర్ ప్రియులు ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు సర్కారీ వైన్స్ బాధ్యతలను సీఐ ఎస్ఐలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here