హిందూ దేవాలయాలపై జగన్ సర్కారు చారిత్రాత్మక నిర్ణయం

0
1042

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల ఓ అన్యమస్థుడు పనిచేస్తున్నాడని.. అతడి ఇంటిలోని మతం వేడుక చేసుకుంటున్న తీరు గురించి వీడియో సైతం రిలీజ్ చేసి కొందరు రచ్చ చేసిన సంగతి తెలిసింది..దీంతో జగన్ సర్కారు అన్యమతస్థులను టీటీడీపీలో ఉద్యోగాలిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తోందని బీజేపీ సహా చాలా పార్టీలు నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..

అందుకే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై హిందూ దేవాలయాల్లో హిందువులకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసింది. అన్యమతస్థులను అనుమతించరని తెలిపింది. ఈ ఆదేశాలు ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు ఏపీలోని అన్ని దేవలయాలకు ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేవాలయాల్లో అన్యమతస్థులు పనిచేస్తుంటే వారిని వేరే శాఖాల్లో మార్పు చేయాలని ప్రభుత్వం ఆ జీవో స్పష్టం చేసింది.

టీటీడీ సహా ప్రముఖ దేవాలయాల్లో హిందూయేతరులు ఉంటే అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉంటే విజిలెన్స్ శాఖకు అందిస్తే నిజనిర్ధారణ చేసి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.చర్యలు తప్పవు.. ఒక వేళ అన్యమతంలో కొనసాగుతూ హిందూ దేవాలయాల్లో విధులు నిర్వహిస్తుంటే.. విజిలెన్స్ శాఖకు సమాచారం అందించాలని జీవోలో స్పష్టం చేసింది. సదరు ఉద్యోగుల ఇళ్లల్లో జరిగే పండగలు, పెళ్లిళ్లు, ప్రార్థనలకు సంబంధించిన వీడియోలను విజిలెన్స్ శాఖకు అందజేస్తే.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

బాబు హయాంలోనే.. చంద్రబాబు హయాంలో కూడా అన్యమతస్తులను హిందూ దేవలయాల్లో నియమించారని, వారందరినీ తొలగించాలని హిందూ సంఘాలు ఇటీవల డిమాండ్ చేశాయి. హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులు, హిందుయేతర వ్యక్తుల నియామకంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

విమర్శల నేపథ్యంలో.. శ్రీశైలంతోపాటు ఇతర ప్రముఖ దేవాలయాల్లోనూ ఇతర మతస్తులను ఉద్యోగాల్లో నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ ఆలయాల్లో హిందువులను మాత్రమే ఉద్యోగాల్లో నియమించాలనే డిమాండ్లు పెరిగాయి. హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు కూడా ఏపీ సర్కారుపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here