17 మంది సీఈవోలతో మోడీ భేటీకి ఎందుకంత ప్రాధాన్యం?

0
1350

వారం రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తున్న మోడీ.. ఆదివారం 17 మంది సీఈవోలతో భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో అత్యంత కీలకమైన సమావేశాల్లో దీన్నొకటిగా అభివర్ణిస్తారు. ఇంతకీ ఈ భేటీ ప్రత్యేకత ఏమిటి? భారత్ కు కలిగే ప్రయోజనం ఏమిటన్నది చూస్తే ఆసక్తికరంగానే కాదు.. రానున్న రోజుల్లో దేశంలోకి కొత్త పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చేందుకు వీలు ఉందన్న అభిప్రాయం కలుగక మానదు.

ఇంతకాలం చమురు.. సహజవాయువుకు సంబంధించి గల్ఫ్ దేశాల మీద ఆధారపడుతోంది భారత్. అయితే.. గల్ప్ లో ఏర్పడుతున్న పరిణామాల కారణంగా భారత్ ప్రభావితం అవుతోంది. దేశంలో వినియోగించే ఇంధనంలో దాదాపు 90 శాతానికి పైనే భారత్ దిగుమతుల మీద ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో కొత్త భాగస్వామ్యం దిశగా మోడీ సర్కారు దృష్టి పెట్టింది. దీని ఫలితమే ఆ రంగానికి చెందిన టాప్ 17 కంపెనీల సీఈవోలతో తాజాగా మోడీ భేటీ అయ్యారు.

ఇంధన భద్రత కోసం కలిసి పని చేయటం.. భారత్ – అమెరికాలలో పెట్టుబడుల అవకాశాల్ని విస్తరించటంపై ఈ సమావేశంలో ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇంధన రంగంలో అగ్ర కంపెనీలుగా పేరున్న 17 సంస్థలకు చెందిన సీఈవోలతో చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయని.. ఫలితాలు పాజిటివ్ గా రానున్నట్లు చెబుతున్నారు. 17 మంది సీఈవోలతో జరిగిన సమావేశాన్ని తన ట్వీట్ తో మోడీ చెప్పేశారు.

ఇంధన రంగంలో ఉన్న అవకాశాల్ని వినియోగించే పద్దతులపై చర్చించామని.. అద్భుత రీతిలో చర్చలు సాగినట్లుగా మోడీ పేర్కొనటం చూస్తే.. రానున్న రోజుల్లో చమురు రంగంలో అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం పెద్ద ఎత్తున ఉందని చెప్పక తప్పదు. మోడీతో సమావేశమైన 17 మంది సీఈవోలు ప్రాతినిధ్యం కంపెనీలు సామర్థ్యం గురించి తెలిస్తే కాస్తంత అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ కంపెనీలు ప్రపంచంలో దాదాపు 150 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండటం.. ఈ 17 కంపెనీల నికర విలువ ఏకంగా రూ.71 లక్షల కోట్లు ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన టెల్యూరియన్.. భారత్ కు చెందిన పెట్రో నెట్ ఎల్ ఎన్ జీల మధ్య రూ.18 వేల కోట్లకు చెందిన ఒప్పందం ఒకటి జరిగింది.

ఇక.. మోడీతో భేటీ అయిన దిగ్గజ కంపెనీలు ఏవంటే..

 1. ఎయిర్ ప్రొడక్ట్స్
 2. బేకర్ హ్యూస్
 3. బీపీ పీఎల్ సీ
 4. చెనీర్ ఎనర్జీ
 5. డొమినియన్ ఎనర్జీ
 6. ఎమర్సన్ ఎలక్ట్రిక్ కంపెనీ
 7. ఎగ్జాన్ మొబిల్
 8. పెరోట్ గ్రూప్
 9. హిల్ వుడ్ ఐహెచ్ ఎస్ మార్కిట్
 10. లిండెలా బాసెల్ ఇండస్ట్రీస్
 11. మెక్ డెర్ మాట్
 12. ష్లమ్ బర్గర్
 13. టెల్యూరియస్
 14. టోటల్ ఎస్ఏ
 15. విన్ మార్ ఇంటర్నేషనల్
 16. వెస్ట్ లేక్ కెమికల్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here