సాయిరెడ్డి పై ఆర్కే అభిమానం..
ఎందుకీ సడన్ ఛేంజ్..!!
కొత్త పలుకులో కొత్త కోణం..!!
సాయి రెడ్డి సత్తా తెలిసొచ్చిందా..!!
కొత్త పలుకులో కొత్త కోణం.వైసిపి నేత విజయ సాయి రెడ్డికి ఆంధ్రజ్యోతి ఆర్కే అభినందనలు. తన కొత్త పలుకులో విజయ సాయిరెడ్డి ని కీర్తించారు. ఏంటీ సడన్ ఛేంజ్. విజయ సాయిరెడ్డి పై ఆర్కేకు ఎందుకు అంత సడన్ గా సదభిప్రాయం ఏర్పడింది. ప్రతీ వారం తన కొత్త పలుకులో వైసిపి నేతలు..ప్రధానంగా జగన్ కు వ్యతిరేకంగా కామెంట్లు రాస్తూ..టిడిపి అధి నేతను ఆకాశానికి ఎత్తే ఆర్కే ఈ సారి కొత్త పలుకులో కొత్త కోణం ప్రదర్శించారు. జగన్ గురించి రాస్తూ జగన్ గ్రేటే ..మరి అంటూ తన దైన శైలిలో సహజ సిద్దంగా తన వ్యాసంలో కామెంట్లు జోడించారు. ఇక, ఈ సారి వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
చంద్రబాబు వ్యతిరేకులను ఏకం చేయటంతో విజయ సాయి రెడ్డి కృషిని అభినందించాలని ఆర్కే పేర్కొన్నారు. చంద్రబాబు పై ఇటీవల కాలంలో విరుచుకుపడుతున్నారంటూ రాసుకొ చ్చారు. కన్నా విషయంలో అమిత్ షా విజయ సాయిరెడ్డి ద్వారానే ఆయన్ను వైసిపి లో చేరకుండా ఆపగలిగారని రాస్తూనే అమిత్ షా తో ఉన్న సంబంధాలను ఎత్తి చూపారు. ఒక్కొక్కరు ఒక్కో దశలో రాజకీయాల్లో రాణిస్తుంటారని..ఇప్పుడు విజయ సాయిరెడ్డి వంతు వచ్చిందని కీర్తించారు. వైసిపి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించటమే కాకుండా.. టిడిపి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని గతంలో ఎన్నడూ లేని విధంగా సాయి రెడ్డి గురించి తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేసారు.
జగన్ ను ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా విజయ సాయి రెడ్డి పని చేస్తున్నారని..ఏపి రాజకీయా ల్లో ప్రముఖుడిగా చలామణి అవుతున్నారని తన కొత్త పలుకులో పేర్కొన్నారు. ఇప్పుడు ఇది టిడిపి నేతలకు రుచించటం లేదు. తమను అనేక సవాళ్లతో ఇబ్బంది పెడుతున్న విజయ సాయిరెడ్డి పై తమకు మద్దతుగా నిలిచే ఆర్కే ఈ విధంగా సడన్ గా ఆయన పై తన వైఖరి మార్చుకున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అయితే, గతంలో విజయ సాయిరెడ్డి పై అనేక వ్యతిరేక కధనాలు వచ్చిన పత్రికలోనే..ఇంతలా సాయిరెడ్డి పార్టీ కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆనుకూలంగా వ్యాఖ్యానాలు రాయటం వెనుక కారణాలు ఏంటనే దాని పై వైసిపి నేతల కంటే టిడిపి నేతలు ఎక్కువగా దృష్టి పెట్టారు. ఏది ఏమైనా..కారణం ఏమున్నా..సాయి రెడ్డి టిడిపి నేతలకు ఏ రకంగా చుక్కులు చూపిస్తుందీ..ఆర్కే ఒప్పుకోక తప్పలేదు.