జగన్ కు శిక్ష పడనుందుకే బిజెపి తో టిడిపి దూరం..
అసలు విషయం బట్టబయలు చేసిన ఆర్కే..
జగన్ కు శిక్షలు పడనుందుకే బిజెపి తో టిడిపి తెగ తెంపులు. జగన్ కేసుల విచారణ మందగించదనే కారణంతోనే బిజెపి ని వీడిన టిడిపి. అసలు గుట్టు విపిన ఆంధ్రజ్యోతి ఆర్కే. ఏపి కి అన్యాయం చేసింది..ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణంతో తాము బిజెపితో పొత్తు వదులుకున్నామనే మాటలు నిజం కాదనే విషయాన్ని తన కొత్తపలుకులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తేల్చి చెప్పారు. అవినీతి కేసుల్లో జగన్ కు శిక్ష పడాలని టిడిపి కోరుకుంది. ఎంతకీ అది జరగకపోగా, విచారణ మందగించటం, తెర వెనుక నుండి జగన్ తో సంబంధాలు పెట్టుకోవటంతో బిజెపి తో మిత్రత్వం కొనసాగించటం లో అ ర్దం లేదనే నిర్ణయానికి టిడిపి వచ్చిందని ఆర్కే విశ్లేషించారు. అయితే, మరి ముఖ్యమంత్రి మొదలు టిడిపి నేతల వరకు ఏపికి అన్యాయం చేస్తుందనే కారణంగానే తాము బిజెపి తో తెగ తెంపులు చేసుకున్నామని చేస్తున్న ప్రచారం అవాస్తమని ఈ విషయంతో తేలి పోయింది.
టిడిపి కి మద్దతుగా నిలిచే ఇదే పత్రికలో అసలు బిజెపి – టిడిపి మధ్య తెగ తెంపులకు అసలు కారణం ఏంటో ఆర్కే తన ప్రత్యేక వ్యాసంలో స్పష్టంగా చెప్పేసారు. ఇక, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారా యణ సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతీ సారీ జగన్ కు శిక్ష పడేలా చూడమని వేడుకున్నారని కుండ బద్దలు కొట్టారు. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ 2014 ఎన్నికల సమయంలోనే టిడిపి నుండి పోటీ చేయాలని భావించా రని ఇదే కొత్త పలుకులో రాసిన ఆర్కే..అప్పట్లో అలా చేస్తే జగన్ పై కేసులు విచారించిన వ్యక్తి..టిడిపి లో చేరిన నష్టం కలుగుతుందని భావించి అప్పట్లో ఆ ప్రతిపాదన వాయిదా వేసారని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా..ఏపిలో అదే జెడి లక్ష్మీనారాయణ తో కొత్త పార్టీ పెట్టించే ఆలోచన చేస్తున్నారని రాసుకొచ్చారు. ఇక, ఇదే వ్యాసంలో తన పై కేసుల కార ణంగా జగన్ ..ప్రధాని మోదీని ఎదిరించే పరిస్థితిలో జగన్ లేరని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీ ప్రభు త్వం పై తొలి అవిశ్వాస నోటీసు ఇచ్చింది వైసిపి అనే విషయాన్ని ఉద్దేశ పూర్వకంగానే విస్మరించినట్లున్నారు. బిజెపి తో జగన్ కలిసారనే ప్రచారాన్ని టిడిపి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే టిడిపి విజయావకాశాలకు ఢోకా ఉండదని కొత్తపలుకు లో ఆర్కే తేల్చేసారు. అంటే టిడిపి..మద్దతు మీడియా తాము ఏం ప్రచారం చేసినా నమ్మేస్తారనే ధీమాతో ఉన్నారా..లేక తాము చెప్పిందే నిజమని ప్రజలు నమ్మాల్సిందే అనే భావనలో ఉన్నారో అర్దం కావటం లేదు. ఒక వైపు టిడిపి తాము ప్రత్యేక హోదా కోసం బిజెపి తో కటీఫ్ చెప్పామని చెబుతుంటే..మద్దతుగా నిలిచే ఆంధ్రజ్యోతి లో కేవలం జగన్ పై కేసుల విచారణ వేగవంతం చేయనుందుకే అంటూ పేర్కొనటం కొంత టిడిపి నేతలకు ఇబ్బందిగానే మారింది. మరి.. ఇటువంటి జిమ్మిక్కులు.. జగన్ లక్ష్యంగా సాగుతున్న వ్యవహారం పై మీ అభిప్రాయాలేంటో మీరే కామంట్ల రూపంలో తెలియచేయండి