వైసిపి ఎమ్మెల్యే రోజా ను కార్నర్ చేసింది శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ అంశం లో రోజా హీరో రాజశేఖర్ కు మద్దతుగా మాట్లాడ టం తో శ్రీ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా రోజాను టార్గెట్ చేసింది. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదా రోజా బాగానే కవరింగ్ లు ఇస్తున్నారు. 27 ఏళ్ల కిందట రోజా పరిశ్రమకొచ్చారు. రోజాను ఎవరూ కెలకలేదట అంటూ తన ట్టిట్టర్ లో పోస్ట్ చేసారు. దీని కి కొనసాగింపుగా రోజా ఎవరికీ నచ్చలేదేమో కొంపదీసి పరిశ్రమ పై నేను బురద వేసానా అంటూనే పరిశ్రమ కు సంబంధించి రిపోర్ట్ సిద్దమవుతోంది నాతో వద్దు నీ లొల్లీ అంటూ ట్వీట్ చేసింది శ్రీరెడ్డి. ఇంత సడన్ గా రోజాపై శ్రీరెడ్డి ఎందుకు ఫైర్ అయిందనే దాని పై అనేక వాదనలు వినిపిస్తున్నాయి.
తాజాగా రోజా హీరో రాజశేఖర్ ను వెనుకేసుకొచ్చారు. రాజశేఖర్ పరిశ్రమకు వచ్చి ఎన్నేళ్లవుతుందో అందరికీ తెలుసని తాను రాజశేఖర్ తో రెండు సినిమాలు చేసిన విషయాన్ని రోజా గుర్తు చేసుకున్నారు. జీవిత లేకుండా ఆయన ఎక్కడికి వెళ్లరు అలాంటి మనిషి తప్పు చేశారంటే ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదని రోజా కామెంట్ చేసారు. రోజా చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు శ్రీరెడ్డి తాజా ట్వీట్లకు కారణమా లేక తెర వెనుక ఎవ రైనా రోజా రాజకీయ ప్రత్యర్ధులు ఇలా చేయించారా అనే సందేహాలు రోజా సన్నిహతుల నుండి వ్యక్తం అవుతున్నాయి. గతంలో రాజశేఖర్ జీవిత గురించి శ్రీరెడ్డి సంచలన కామెంట్లు చేసింది. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఆరోపించింది. అయితే, రాజశేఖర్ కు రోజా క్లీన్ చిట్ ఇవ్వటం నచ్చకనే శ్రీరెడ్డి ఇలాంటి ట్వీట్లు చేసిందని అనుమానిస్తున్నారు. అయితే, సహజంగానే ఫైర్ బ్రాండ్ అయిన రోజా రాజకీయంగానే కాకుండా సినిమాల విషయంలోనూ తన పై అవసరంగా విమర్శలు చేస్తే ధీటుగా స్పందిస్తారు. మరి ఇప్పుడు ఏకంగా క్యాస్టింగ్ కౌచ్ అంశంలో రోజాను కార్నర్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన పోస్టింగ్ ల పై రోజా ఏ స్థాయిలో స్పందిస్తారో చూడాలి.