జగన్ పై అభిమానానికి ఎల్లలు లేవు – American Lady Melody Says Jagan is The Leader

0
461

జ‌గ‌న్ అంటే తెలుగు వారే కాదు.. విదేశీయులు సైతం ఫిదా. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో నిత్యం అనుస‌రిస్తున్న అభిమానులు చా లా మందే ఉన్నారు. అయితే, జ‌గ‌న్ ను ఒక్క‌సారైనా క‌ల‌వాల‌ని కోరుకొనే వారి సంఖ్య పెద్ద‌దే. ఇదే త‌ర‌హాలో ఓ విదేశీ మ‌హి ళ సైతం జ‌గ‌న్ కోసం త‌న ఇద్ద‌రు చిన్నారి కూతుళ్ల‌తో క‌లిసి నిరీక్షించారు. జ‌గన్ ను క‌లిసారు. ఇక‌, ఆమె సంతోషానికి ప‌ట్ట ప‌గ్గాలు లేవు. అమెరికా కు చెందిన మెలోడి అనే మ‌హిళ‌, నూజివీడు ప్రాంతానికి చెందిన ప్ర‌వాసాంధ్రుడితో ప్రేమ వివాహం చేసుకుంది. నూజివీడు ప్రాంతంలోనే ఒక పాఠ‌శాల నిర్వ‌హిస్తోంది. వైయ‌స్ గురించి పూర్తి అవ‌గాహ‌న ఉన్న మెలోడి, జ‌గ‌న్ గురించి విన్నారు. ఎలాగైనా జ‌గ‌న్ ను క‌ల‌వాల‌ని పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ వ‌ద్ద కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో జ‌ర‌గిన తోపు లాట‌లో మెలోడి చిన్న కుమార్తె కింద ప‌డిపోయింది. జ‌గ‌న్ వెంట‌నే ఆ చిన్నారిని పైకి లేపారు. జ‌గ‌న్ స్పంద‌న చూసిన ఆ మెలోడి తన‌తో జ‌గ‌న్ రెండు నిమిషాలు మాట్లాడిన తీరు లోనే తాను తాను ఇప్ప‌టి వ‌ర‌కు విన్న‌ది అనే భావ‌న‌కు వ‌చ్చేసింది. ఇత‌ర రాజ‌కీయ నాయ‌కుల్లా కాకుండా విలువ‌లు ఉన్న పొలిటిషియ‌న్ జ‌గ‌న్ అంటూ మెలోడి కీర్తిస్తోంది.

జ‌గ‌న్ పై మెలోడికి పూర్తి అవ‌గాహ‌న ఉంది. వైయ‌స్ పాల‌న‌, వైయ‌స్ హ‌ఠాన్మ‌ర‌ణం, జ‌గ‌న్ రాజ‌కీయంగా ఎదుర్కొన్న ఆటుపోట్లు ఇలా పూర్తి అవ‌గాహ‌న తో జ‌గ‌న్ పై అభిమానం పెంచుకుంది. ఎలాగైనా జ‌గ‌న్ ను క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్న మెలోడి కృష్ణా జిల్లా పాద‌యాత్ర లో త‌న అభిమాన నేత‌ను క‌లుసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు విదేశాల్లో ఉన్న ప్ర‌వాసాంధ్రులు సైతం జ‌గ‌న్ కు ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతూ ప్ర‌తీ సంద‌ర్భంలోనూ పిలుపునిస్తున్నారు. ఎక్క‌డో అమెరికా నుండి వ‌చ్చిన మెలోడి లాంటి వారే జ‌గ‌న్ పై అంత‌గా అభిమానం పెంచుకుంటే, ఇక్క‌డి వారు జ‌గ‌న్ ను ఆరాధించ‌టం లో ఆశ్చ‌ర్యం ఏముంది. అందుకే జ‌గ‌న్ ఓ స‌మ్మోహ‌నాస్త్రం. అంత జ‌నాద‌ర‌ణ జ‌గ‌న్ కే సాధ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here