టిడిపి హైక‌మాండ్ ను ఉతికి ఆరేసారు..టిడిపితో ఆనం తెగ‌తెంపులు – Anam Ramana Reddy Will Join YCP Soon

0
460

టిడిపి తో ఆనం రామనారాయ‌ణ రెడ్డి తెగ‌తెంపులు. టిడిపి హైక‌మాండ్ ను ఉతికి ఆరేసారు. ఇంఛార్జ్‌గా ఉన్నా ఛార్జింగ్ లేదు.ప్ర‌జ‌ల్లో 80 శాతం సంతృప్తి ఉంద‌ని అధినేత చెప్ప‌టం అబ‌ద్దం.  నెల్లూరు జిల్లా సీనియ‌ర్ టిడిపి నేత ఆనం రామనారాయ‌ణ రెడ్డి పార్టీ వీడ‌టానికి రంగం సిద్ద మైంది. ఆనం వివేకా అనారోగ్యం స‌మ‌యంలోనూ ఆనం బ్ర‌ద‌ర్స్ పార్టీ వీడ‌తారనే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆనం వివేకా మృతి తో రాజ‌కీయంగా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ, ఇప్పుడు ఆ నం రామ‌నారాయ‌ణ రెడ్డి టిడిపి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. త‌న 35 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఏనాడు ఇన్ని అవమానాలు ఎదుర్కోలేద‌ని వాపోయారు. ప్ర‌జ‌ల్లో 80 శాతం సంతృప్తి ఉంద‌ని ముఖ్య‌మంత్రి చెప్ప‌టం అబ‌ద్ద‌మ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసారు.

మంత్రి సోమిరెడ్డి మీద ఆనం ఫైర్ అ య్యారు. రైతులు తిరుగుబాటు చేసే ప‌రిస్థితి ద‌గ్గ‌ర‌ల్లోనే ఉంద‌ని ఆనం హెచ్చ‌రించారు.  మినీ మ‌హానాడులో పాల్గొన్న ఆనం అధికార పార్టీ ఇంచార్జిగా ఉన్న చార్జింగ్ మాత్రం లేదు. నేను కేవలం జెండా పట్టుకోవడానికే సరిపోతానా. ప్రజల సమస్యలు తీర్చడానికి నేను పనికిరానా. మినీ మహానాడు పెట్టుకుని మనకు మనమే భజన చేసుకుంటూ ఉంటే సరిపోతుందా…అంటూ కార్య‌క‌ర్త‌లు..పార్టీలోని ఇత‌ర నేత‌ల స‌మ‌క్షంలో నే ఉతికి ఆరేసారు. అభివృద్ధితోనే గెలుపు సాధ్యం కాదు. కార్యకర్తలకు అండగా ఉన్నప్పుడే విజయం వరిస్తుందని తేల్చి చెప్పారు. జిల్లాలో ఉన్న వారి వద్ద నుంచి మాకు వ్యతిరేకత వస్తున్నప్పుడు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని ప్ర‌శ్నించా రు. నియోజక వర్గంలో ఎన్నో సమస్యలు… అభివృద్ధిపై ఎన్నిసార్లు చంద్రబాబుకు విన్నవించుకున్నా ఫలితం శూన్య మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.  సోమశిల హైలెవల్ కెనాల్ లో ప్ర‌భుత్వ తీరు కమీషన్ల కోసమా లేక రైతులను మభ్యపెట్ట డానికా… అని ప్రభుత్వ తీరుపై ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో..ఇక ఆనం టిడిపిని వీడ‌టం ఖాయ‌మై పోయింది. వైసిపి లో ఆనం రాక‌పై కొంద‌రు జిల్లా నేత‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. వారిని నెల్లూరు వైసిపి ఇన్‌ఛార్జ్ బుజ్జిగిస్తున్న‌ట్లు స‌మాచారం. నియోజ‌క‌వ‌ర్గం మీదే ప్ర‌స్తుతం మంత‌నాలు సాగుతున్నాయి. త్వ‌రలోనే ఆనం టిడిపిని వీడి అధికారికంగా వైసిపి లో చేర‌టం ఖాయంగా క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here