ఇటీవల ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, తానూ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల నుంచి ఏడాది లోపే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాని హామీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే, అందుకోసమని అదే దిశగా అడుగులు వేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి… ఇప్పటికే జగన్ అధికారులతో నిర్వహించే రివ్యూ మీటింగ్ లలో తనదైనటువంటి శైలి చూపిస్తున్నారు.
ప్రతి విషయంలో కూడా జగన్ ముక్కుసూటిగా వెళ్తున్నారని తెలుస్తుంది. డాష్ బోర్దు లెక్కలు తనకొద్దని, శాఖల్లో వాస్తవాలు మాత్రమే చెప్పాలని సమావేశానికి ముందే అధికారులకు జగన్ స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. వీలైనంత తొందర్లోనే హామీలన్నింటిని కూడా జగన్ నెరవేర్చనున్నారు. అందరు అధికారులతో కూడా కలివిడిగా ఉంటూ, వారితో కలిసిపోయి పనులన్నీ చేస్తున్నారు. దీంతో పాటు గతంలో తమ శాఖలో జరిగిన అవినీతిని తమ దృష్ఠికి తీసుకొస్తే వెంటనే ప్రొమోషన్ ఇచ్చి అధికారులను సన్మానిస్తానని జగన్ తన రివ్యూ మీటింగ్ లో అధికారులతో చెప్పినట్లు సమాచారం.అంతేకాకుండా ముఖ్యమంత్రిగా కేవలం ఒకే ఒక్క రూపాయి తీసుకోని మరీ ప్రజాసేవ చేస్తానని ప్రకటించిన జగన్ తన వ్యక్తిగత ఖర్చులు మరియు ప్రభుత్వ ఖర్చులు అన్ని కూడా వేర్వేరుగా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్ వ్యవహార శైలిలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కనిపిస్తున్నారని పలువురు అధికారులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా జగన్ తన ముఖ్యమంత్రి హోదాలో వాడుకోవాల్సిన అవసరాలన్నింటిని కూడా వాడుకోడానికి అంత సుముఖంగా లేరని, కేవలం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.