రోజా పై జగన్ తీసుకున్ననిర్ణయం ఇంత దుమారాన్ని రేపుతుందా? – AP CM YS Jagan decision on Nagari MLA RK Roja not giving any ministry

0
610

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆ పార్టీకి చెందినటువంటి కీలక మహిళా నేత రోజా విషయంలో తీసికున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.జగన్ వెన్నంటే ఉండి సొంత అన్నలా భావించిన రోజాకు ఖచ్చితంగా జగన్ క్యాబినెట్ లో కీలక మంత్రి పదవి దక్కుతుందని ప్రతీ ఒక్కరు అనుకున్నారు.కానీ అనూహ్య పరిస్థితుల్లో జగన్ రోజాకు తన మంత్రి వర్గంలో స్థానం కల్పించలేకపోయారు.

రోజా సహా సామాన్య ప్రజానీకం కూడా జగన్ రోజాకు అన్యాయం చెయ్యడని తప్పక మంచి స్థానంలో ఉంచుతారని అనుకున్నారు.వారందరి అంచనాలను జగన్ మార్చేసి రోజా సహా చాలా మంది కీలక నేతలకు అవకాశం కల్పించలేదు.మిగతా నేతల విషయంలో ఏమో కానీ రోజా విషయంలో జగన్ తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం మాత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది.అసలు రోజాకు ఎందుకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వలేదు?కావాలనే ఇవ్వలేదా లేదా కొన్ని కారణాల వల్ల అలా చెయ్యాల్సొచ్చిందా అని అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి.అందుకు నిదర్శనంగా యూట్యూబ్ లో చూసుకున్నట్టయితే రోజాకు ఎందుకు స్థానం దక్కలేదు అందుకు గల కారణాలు ఏమిటని పలు మీడియా చానెళ్లు వారు చేసిన వీడియోలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నడుస్తున్నాయి.దీన్ని బట్టి రోజాకు పొలిటికల్ ఎలాంటి పేరు ఉందో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.మరి జగన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ఆయనే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here