బాలయ్య కు షాక్ , హిందూపూర్ ను జిల్లా చేసే పనిలో జగన్, AP CM YS Jagan likely to Change Hindupur as District

0
427
ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే నాలుగు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, స్థితి గతులను చక్కదిద్దే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. దీనికి తోడుగా ఈ నెల 8న మంత్రి వర్గ కేబినెట్‌ను కూడా ప్రకటిస్తానని జగన్ ఇప్పటికే చెప్పేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ అనంతరం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జిల్లాలను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారట. అయితే ఈ అస్త్రం కాస్త టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యపైన కూడా ప్రయోగించాలాని జగన్ అనుకుంటున్నారట. అందుకోసం ప్రస్తుతం అనంతపురం జిల్లాలో భాగంగా ఉన్న హిందూపురంను విదదీసి కొత్త జిల్లాగా మార్చి బాలయ్యను దెబ్బకొట్టాలనే ప్లాన్‌లో ఉన్నారట. అయితే రాష్ట్రమంతటా వైసీపీ ప్రభంజనం వీస్తుంటే హిందూపురంలో మాత్రం ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి బాలయ్య అధిక్యంలోనే కనపడ్దారు. ఫలితంగా ఇక్కడి నుంచి రెండో సారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే బాలయ్య తండ్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందడంతో ఇక్కడ కాకుండా జిల్లా మొత్తం టీడీపీకి కంచుకోటగా మారింది. అందుకే హిందూపురంలో బాలయ్య పసుపు జెండా మరోసారి ఎగిరింది. అయితే ఈ సారి మాత్రం టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యింది.
హిందూపురం నుంచి బాలయ్యతో పాటు ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్ మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. అంతేకాదు అనంతపురం ఎంపీ స్థానం కూడా వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య గెలుచుకోగ, హిందూపురం ఎంపీ స్థానాన్ని కూడా వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ గెలుచుకున్నారు. అయితే ఇప్పటికే జిల్లాలో పూర్తిగా పట్టు కోల్పోయిన టీడీపీకి కొత్త షాక్ ఇచ్చేలా హిందూపురంను జిల్లగా మార్చి వైసీపీ తన పట్టును సాధించుకోడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇదే కనుక జరిగితే హిందూపురంలో బాలయ్యకు పట్టు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here