జగన్ కొత్త ప్లాన్.. అమలైతే…తిరుగు ఉండదు ..!!
జగన్ అధికారంలోకి వచ్చాక నిర్ణయాలు తీసుకోవడంలో వేగం పెరిగింది. అనుకున్నట్టుగా పాలన సాగించేందుకు అధికారుల మార్పులు జరిగిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మార్పులు జరిగాయి. ఇది సహజమే. కాకపొతే జగన్ వచ్చిన వెంటనే ఇలాంటి నిర్ణయాలు ఫాస్ట్ గా తీసుకోవడం విశేషం. ఇప్పుడు జగన్ కొత్త ప్లాన్ ను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో ఎక్కువమంది రాయలసీమ నుంచి వచ్చిన వారే.
నవ్యంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు కూడా రాయలసీమకు చెందిన వ్యక్తే. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు వస్తున్నా.. ఆ ప్రాంతానికి ఒరిగింది ఏమిలేదు. దీంతో జగన్ ఆ ప్రాంతం ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారు. గ్రేటర్ రాయలసీమ ఏర్పడితే.. ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. అభివృద్ధి సాధ్యం అవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలకమైన శాఖలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా చేయడం వలన అక్కడి ప్రాంతం వారికి ఆ శాఖల్లో పనులుంటే అక్కడి నుంచే చేసుకోవచ్చు. అమరావతి వరకు రావాల్సిన అవసరం ఉండదు కదా.