వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసలు పనిలో పడ్డారు.వైసీపీ అభిమానులు మరియు జగన్ కన్న కలలు ఈ ఒక్క సంవత్సరంలో నెరవేరింది. అయితే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది కీలకంగా మారింది. ఇప్పటికే పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. అంతే కాకుండా సినీ రంగం నుంచి కూడా చాలా మంది పేరున్న నటులే చేరారు. వారిలో ప్రముఖంగా చెప్పాలి అంటే అలీ,పృథ్వీ రాజ్ మరియు సీనియర్ నటి జయసుధ కూడా ఉన్నారు.
జగన్ జయసుధ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక వార్త సంచలనంగా మారింది. జగన్ జయసుధకు “ఏపీ ఎఫ్ డీసీ” ఛైర్మెన్ గా పదవులు అప్పగించే యోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. అయితే ఈ పదవికి గాను అలీ,మోహన్ బాబు,అలాగే పృథ్వీ రాజ్ వంటి వారు కూడా రేస్ లో ఉన్నారట. అయినా సరే జగన్ మాత్రం ఈ పదవిని జయసుధ గారికే కట్టబెట్టేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఒక టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.