టిడిపి పెద్దలు జీర్ణించుకోలేని నిజం ఇది. ప్రజల్లో ప్రభుత్వం పై 80 శాతం సంతృప్తి అనేది ఉత్తుత్తి మాట. 70 శాతానికి పైగా అసంతృప్తి. ఇది..టిడిపి పెద్దలకు తాజాగా వారి ఆస్తాన నిపుణుడు చేయించిన సర్వేలో తేలిన వాస్తవం. బిజెపి తో తెగ తెంపులు..పవన్ కళ్యాన్ తో దూరం పెరిగిన తరువాత క్షేత్ర స్థాయిలో టిడిపి పరిస్థితి పై ఆపార్టీ అధినాయకత్వం ఓ సర్వే చేయిస్తోంది. సర్వే ఫలితాల విషయంలో తమ ఆస్థాన నిపుణుడు ..2014 ఎన్నికల నాటి నుండి టిడిపితో సఖ్యతగా ఉంటూ సర్వేల్లో మంచి క్రెడిబులిటీ సంపాదించిన వ్యక్తి తో ఈ సర్వే చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సర్వే సూక్ష్మ స్థాయిలో అనేక అంశాలతో పాటుగా..ప్రభుత్వ పని తీరు..ఎమ్మెల్యేల శైలి పైనా సైతం ఇందులో ఆరా తీసి నట్లు తెలుస్తోంది. అయితే, తమకు నమ్మకమైన ఆ వ్యక్తి కి చెందిన సంస్థ చేస్తున్న సర్వేలో వస్తున్న ఫలితాలు చూసి టిడిపి అగ్ర నాయకత్వం విస్తుపోతోంది. జగన్ పాదయాత్ర ఆ పార్టీకి బాగా మేలు చేసిం దని..టిడిపి పై వ్యతిరేకత పెం చుతోందని సర్వేలో నివేదించినట్లు సమాచారం. ఇక, ఎమ్మెల్యేల పనితీరుపైనా ప్రజల్లో తారా స్థాయిలో అసంతృప్తి ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వం ఎంత అసంతృప్తి ఉన్నా..మీడియా మేనేజ్‌మెంట్ ద్వారా నెట్టుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
ప్రభుత్వ మేనేజ్‌మెంట్ లెవల్స్ భారీ స్థాయిలో ఉన్నా…ప్రజలు పూర్తిగా వారిని వి శ్వసించటం లేదనే విషయం తేట తెల్లమైంది. పవన్ కళ్యాన్ పార్టీ సభలో ప్రభుత్వం మీద..ముఖ్యంగా మంత్రి లోకేష్ పైనా చేసిన అవినీతి ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని సర్వే నిర్ధారించింది. ప్రత్యేక హోదా సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందని.. టిడిపి అధినేత పలుమార్లు మాట మార్చటం పైనా ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని సర్వే స్పష్టం చేసింది. ఈ ఏడాది చివర్లో పార్లమెంట్ ముందస్తు ఎన్నికలు.. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేకపోవటంతో ఈ సర్వే వివరాలు చూసి టిడిపి నాయకత్వం విస్తుపోయింది. ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన నష్ట నివారణ చర్యల మీదా దృష్టి పెట్టింది. ఒక వైపు జగన్..మరోవైపు పవన్ ప్రజల్లో ఉంటున్నారని..టిడిపి పూర్తిగా మీడియా నే నమ్ముకొని ముందు కు వెళ్లటం ద్వారా ఉపయోగం లేదనే విషయం పైనా ప్రభుత్వ పెద్దల వద్ద ఈ సర్వే లో పేర్కొన్నట్ల సమాచారం. ఇక,
ఈ నష్టాన్ని నివారించటం కోసం టిడిపి కోర్ టీంతో పాటుగా అండగా నిలిచే మీడియా పెద్దలతోనూ చర్చలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరింతగా టిడిపిని ప్రజలకు దగ్గరకు చేస్తూ..అదే సమయంలో జగన్..పవన్ ను ప్రజలకు మరింత దూరం చేసేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు టిడిపి ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. అయితే, ప్రజల్లోనే ఉంటున్న జగన్ ను ఎదుర్కొనేందుకు టిడిపి వేస్తున్న ఎత్తు గడలు ఫలించే అవకాశం కనిపించటం లేదు. ఈ ఎన్నిక ల్లో నవ్ ఆర్ నెవర్ అనే విధంగా జగన్ ముందుకెళ్తున్నారు. మరి..జగన్ ను అడ్డుకోవటం టిడిపికి సాధ్యమేనా అనేది క్షేత్ర స్థాయిలో ఉన్న జగన్ అభిమానులే వాస్తవాలు కామెంట్ల రూపంలో తెలియచేయాలి.