ముసుగు తొలిగింది. ఇప్పటి వరకు ఉన్న తెర దించేసారు. నేరుగా ఒకరి పై మరొకరి అభిమానాన్ని బహిరంగ వేదికగా చా టుకున్నారు. ఏపి ఎన్జీవో సంఘ అధ్యక్షుడు తొలి నుండి టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నానే అభిప్రాయం ఉంది. ఉద్యోగుల అంశాల కంటే టిడిపి మద్దతు కార్యక్రమాలకే ఎక్కువ మద్దతు ఇస్తున్నారనే విమర్శ ఉంది. ఏపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటమే కాకుండా..కర్నాటకలో టిడిపి ప్రతినిధిగా వెళ్లి..అక్కడ బిజెపి వ్యతిరేక ప్రచారం చేసారు. అదే సమయంలో అక్కడి తెలుగువారు తిరగబడటంతో వెనక్కు తిరిగి వచ్చేసారు.
ఇక, తాజాగా విజయవాడ లో జరిగిన పునరం కిత సభ లో తన ప్రసంగం ముగించిన సీయం మరోసారి మైకు తీసుకొని అశోక్‌బాబు గురించి మాట్లా డారు. అశోక్ బాబు మరో ఏడాదిలో రిటైర్ కాబోతున్నారని, ఆయన ఇంతకాలం ఉద్యోగుల సేవలో ఉన్నారని,ఇప్పుడు ప్రజాసేవలోకి రావాలని కోరుతున్నామని ఆయన అన్నారు.మంచివారు ప్రజాసేవలోకి రావాలని ,ఆయన దీనిపై ఆలో చించుకుని తెలియచేయాలని చంద్రబాబు కోరడం విశేషం. దీని ద్వారా తమ ప్రభుత్వం పై ఉద్యోగ సంఘాల అధ్యక్ష పదవి హోదాలో పూర్తిగా ప్రభుత్వ భజన చేసిన అశోక్‌బాబు ను టిడిపి లోకి అధికారికంగా స్వాగతం పలుకుతున్నట్లు అర్దమవుతోంది. ప్రస్తుతం ఉద్యోగుల పీఆర్సీ అరియర్స్ పై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సాగిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ముఖ్యమంత్రి..అవసరం లేక పోయినా అశోక్‌బాబును రాజకీయాల్లోకి ఆహ్వానించారు.
ఇప్పటి వరకు అశోక్‌బాబు అనధికారిక టిడిపి నేతగా వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. ఇక, ఏడాది లో రిటైర్ కావాల్సి ఉండటంతో ముఖ్యమంత్రి ఇంతలా ఓపెన్ గా రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ మాట్లాడటం ద్వారా..ఆయన ఉద్దేశం ఏంటో చెప్పకనే చె ప్పినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా అశోక్ బాబు ఉద్యోగుల సేవలో లేరని..టిడిపి సేవలోనే ఉన్నారని ఏపిలో ఓ ప్రముఖ ఉద్యోగ సంఘ నేత వ్యాఖ్యానించారు. సమైక్య ఉద్యమ సమయంలో అశోక్‌బాబు ఏపికి అన్యాయం చేసారని ఆయనతో కలిసి పని చేసిన నేతలు ఇప్పటికీ ఆయన కలిసి వేదిక పంచుకోవటానికి ఇష్టపడరు. ఇక, ఇప్పుడు నేరుగా టిడిపి లోకి రమ్మని కాకుండా..ముఖ్యమంత్రి ఆశోక్‌బాబును రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఇక, ఆశోక్‌బాబు అధికారికంగా పసుపు కండువా కప్పుకోవటమే మిగిలి ఉంది.