ఏపిలో మహిళలు ఈ నివేదిక చూస్తే టిడిపికి ఓట్లు వేస్తారా. ఏపి పరువు తీస్తుందెవరు. మహిళల పై దౌర్జన్యాల్లో టిడిపి నేతల జాతీయ రికార్డ్. ఇద్దరు మంత్రులు,ముగ్గురు ఎమ్మెల్యే పేర్లను బయట పెట్టిన జాతీయ సంస్థ. ఇది విపక్ష వైసిపి నో లేక మరో రాజకీయ పార్టీ చేసిన విమర్శ కాదు. ఎన్నికల నిఘాకు సహకరించే, స్వచ్చంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమో క్రటిక్ రిఫార్మ్స్ తాజాగా ఓ సర్వే చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ పార్టీల్లో చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధుల్లో మహిళల పై దాడులు. దౌర్జన్యాలు చేస్తున్న వారి పేర్లను తమ నివేదికలో బహిర్గతం చేసింది. మహిళ లపై దౌర్జన్యాలు..దాష్టీకాలు చేస్తున్న వారి పేర్లు..వారి పై ఉన్న కేసులతో సహా ఈ సంస్థ వివరాలను బయట పెట్టింది. వనజాక్షి, వ్యవహారం కాల్‌మనీ అంశంలోనే టిడిపి ప్రభు త్వం మహిళా వేధింపుల పై అనేక విమర్శలు ఎదుర్కొంది.
తాజా గా ఈ సంస్థ వెల్లడించిన వాస్తవాల్లో మంత్రులు దేవినేని ఉమా, అచ్చం నాయుడు పేర్లు ఉన్నాయి. వీరే కాకుండా టిడిపి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బండారు సత్యనారా యణ, వరదాపురం సూర్యానారాయణ, పేర్లు ఉన్నాయి. అందులో అధికంగా ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పై మొత్తం 23 కేసులు మహిళల, పై దౌర్జన్యాల కింద నమోదయ్యాయి. కాగా, అందులో 13 కేసులు తీవ్రమైన నేరంగా పరిగణిం చేసెక్షన్ల కింద నమోదయ్యాయి. ఇక, విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ, పై 4 కేసులు నమోదయ్యా యి.
అనంతపురం జిల్లా ధర్మవరం, ఎమ్మెల్యే వరదాపురం సూరి పై 10 కేసులు నమోదయ్యాయని. కేసుల వివరాలు విచారణ స్థితి గతులను ఈ నివేదిక లో వివరించారు. ఇక, మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, పై 13 కేసులు మహిళల పై దౌర్జన్యాల కేసులుగా నమోదైనట్లు ఏడిఆర్ సంస్థ వెల్లడించింది. మరో మంత్రి అచ్చంనాయుడు, పై క్రైం ఎగైనస్ట్ ఉమెన్ కింద రెండు కేసులు నమోదయ్యాయి. మంత్రుల స్థానంలో ఉన్న ఇద్దరి తో సహా, విప్ స్థానంలో ఉన్న ఒక ఎమ్మెల్యే తో పాటుగా మరో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల పై తాజాగా వెలుగులోకి వచ్చిన ఏడిఆర్ సంస్థ నివేదిక. ఇప్పుడు ఏపిలో రాజకీయంగా కలకలం రేపుతోంది. మహిళల పట్ల టిడిపి నేతలు ఎలా వ్యవహరిస్తున్నారో స్పష్టం చేస్తుంది. ఇప్పుడు ఇది రానున్న ఎన్నికల్లో మహిళా ఓట్ల పై ప్రభావం చూపే అవకాశం ఉంది.