వైసిపి అభిమానులు నమ్మలేని నిజాలు..
అధికారం దక్కాలంటే కావాల్సింది ఇదే..
ycp లో మారుతున్న సమీకరణాలు..
రంజుగా మారుతున్న గోదావరి రాజకీయం. అభ్యర్ధులను ప్రకటిస్తున్న జగన్. ఉభయ గోదావరిలో కొత్త సమీరణాలు. గోదావరి జగన్ నామ స్మరణతో ఘోషించింది. వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమనే సమరనాదాన్ని మోగించింది. గోదావరి జిల్లాల్లో సీన్ మారుతోందది. ఆ రెండు జిల్లాల్లో ఎవరు గెలిస్తే వారిదే అధికారం అనేది అందరి నమ్మకం. జగన్ కు గోదావరి జిలాల్లో వచ్చిన అనూహ్య స్పందన ప్రతీ ఒక్కరిలో ఆలోచన కలిగిస్తోంది. గోదావరి జిల్లాల్లో జగన్ ఎఫెక్ట్ తో అధికార పార్టీ పునరాలోచనలో పడింది. జగన్ పాదయాత్ర సమయంలో ఒక నమ్మకైన సంస్థతో సర్వే చేయించుకున్నారు. అందులో ఊహించని ఫలితాలు వచ్చాయి.
ఈ రెండు జిల్లాల్లో గత ఎన్నికల్లో పవన్ కళ్యాన్ ప్రభావం కనిపించింది. అదే టిడిపికి అధికారంలోకి రావటానికి సహకరించింది. ఇప్పుడు అదే అక్కడ రివర్స్ అవుతోంది. సర్వేలో తేలిన విష యమూ అదే.స్వతహాగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల ప్రజల్లో రుణమాఫీ హామీ విస్మరణ బాగా ప్రభావం చూపుతోంది. జగన్ కు ఈ రెండు జిల్లాల్లో వచ్చిన స్పందన తో అక్కడ కాయకల్ప చికిత్స కు టిడిపి అధినాయకత్వం రంగంలోకి దిగింది. కొల్లేరు పై దృష్టి సారించింది. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీల పై నిర్ణయం తీసుకుంది.
జగన్ గోదావరి జిల్లాల్లో ఉండగానే పోలవరం పునాదులను జాతికి అంకితం అంటూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. అయినా..అదే రోజు జగన్ తూర్పు లో ఎంట్రీ తో గోదావరి జన గోదారిగా మారిపోయింది. ఇక, గత ఎన్నికల్లో ఒక్క సీటు రాని పశ్చిమ గోదావరి లో వైసిపి లోకి చేరికలు…పార్టీలో కొత్త జోష్ ను నింపుతున్నాయి. ఇక, గత ఎన్నికల్లో అయిదు సీట్లు దక్కించుకున్న తూర్పులో ఎంట్రీ చూసిన తరువాత పార్టీని వీడిన నేతలు తిరిగి వైసిపిలోకి వస్తామంటూ రాయబారాలు నడుపుతున్నారు. కానీ, జగన్ ససేమిరా అంటున్నారు. ప్రతీ ఒక్క వర్గాన్ని..ప్రతీ పరిశ్రమ కు చెందిన వారిని కలుస్తూ..వారితో జగన్ మమేకం అవుతున్నారు. ఇక, ఈ రెండు జిల్లాల్లో వచ్చిన ఫలితాలతోనే రాష్ట్ర స్థాయి లో అధికారం దక్కుతుందనే నమ్మకం తో..జగన్ కు ధీటుగా అనేక నిర్ణయాలతో ప్రభుత్వం సిద్దమవుతోందది. కానీ, ఆ క్రెడిట్ సైతం జగన్ కే దక్కుతుందని వైసిపి నేతలు నమ్ముతున్నారు. ఇక, వైసిపి నేతలు అంచనా వేస్తున్నట్లు గా..నిఘా వర్గాలు ఇస్తున్న నివేదికలు ఆధారంగా చూస్తే..ఈ రెండు జిల్లాల్లో సీన్ మారిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది . ఇది..వైసిపి నిజంగా నమ్మలేని నిజం. ఇక, పవన్ కళ్యాన్ ప్రభావం ఈ సారి ఏ విధంగా ఉంటుందనే అంచనాలు మొద లయ్యాయి. కానీ, జగన్ సృష్టించిన జన సునామీ ని మించే స్థాయిలో మాత్రం ఉండదని వైసిపి నేతలు గట్టిగా చెబుతు న్నారు. దీంతో..ఇప్పుడు గోదావరి రాజకీయం రంజుగా మారింది