కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కి పదవి ఉంటుందా..ఊడుతుందా. బలపరీక్ష కు మూహూర్తం ఖరారైంది. శనివారం సాయంత్రం 4 గంటలకే బల పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీం నిర్ధేశించింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ బల పరీక్షలో నెగ్గుతా మని ధీయా బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుం 222 మంది సభ్యులు ఉన్న సభలో 113 మంది సంఖ్య బలం బిజెపి కి అవసరం . అయితే, 104 మంది సభ్యుల బలం మాత్రమే బిజెపికి ఉంది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు..తాజాగా మరొకరు మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు బిజెపికి మద్దతుగా ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే, బిజెపి కొత్త వ్యూహం అమలు చేస్తున్నట్లు తాజా సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు లక్ష్యంగా బిజెపి పావులు కదుపుతోంది. ఇందులో కొందరు కాంగ్రెస్ నుండి…మరి కొందరు జెడిఎస్ నుండి ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు సభలోనే బిజెపి కిమద్దతు ప్రకటించేలా వ్యూహం సిద్దం చేస్తోంది. వీరి సంఖ్య ఆధారంగా మరి కొందరు విశ్వాస పరీక్షకు గైర్హాజరయ్యేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీని ద్వారా సభలో మేజిక్ ఫిగర్ తగ్గిపోతుంది. 222 మంది సభ్యుల సభలో కుమారస్వామి రెండు నియోజకవర్గాల నుండి గెలుపొందారు. అంటే వాస్తవంగా సభలో సభ్యుల సం ఖ్య 221. కొందరు గైర్హాజరైతే ఆ సంఖ్య మొత్తంలో 50 శాతం ప్లస్ ఒన్ మేజిక్ ఫిగర్ గా నిరూపించుకోవాలి.
మాజీ ప్రధాని, జెడిఎస్ నేత దేవగౌడ పుట్టినరోజు సందర్భంగా దేవగౌడ కు ప్రధాని మోదీ ఫోన్ చేసారు. ఆ సమయంలో కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మరో 24 గంటలకు పైగా విశ్వాస పరీక్షకు సమయం ఉండటంతో..ఏదైనా జరగవచ్చని బిజెపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయం లో కాంగ్రెస్-జెడిఎస్ నేతలు సైతం బిజెపి ఏ రకంగా తమ ఎమ్మెల్యేల పై వ్యవహరిస్తోందనే టెన్షన్ తో ఉన్నారు. దీంతో.. క్యాం పులు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలను కాపాడుకొనే పనిలో పడ్డారు. ఇప్పటికే బిజెపి అధినేత అమిత్ షా తమకు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు పార్టీ తరపున న్యాయస్థానానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఏ ఆధారం లేకుండా బిజెపి ఈ విధంగా కోర్టుకు సమాచారం ఇచ్చే అవకాశం లేదు. దీంతో.. కర్నాటకలో వచ్చే 24 గంటలు కీలకం కానుంది. ఏది ఏమైనా విశ్వాస పరీక్ష గెలవాలని బిజెపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక వేళ..ఇది సాధ్యం కాని పరిస్థితుల్లో సింపథీ తెచ్చుకొనే విధంగా రాజకీయంగా అడుగులు వేయాలని భావిస్తోంది. ఇక, కర్నాటకలో ప్రతీ నిమిషం..టెన్షన్ టెన్షన్. కర్నాటలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావటాన్ని జీర్ణించుకలేక పోతున్న ఏపి టిడిపి నేతలు..ఇప్పుడు కర్నాటక లో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది.